📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Himanta Biswa Sarma: బలూచిస్థాన్‌ను పాకిస్థాన్ దోచుకుంటోంది: అసోం సీఎం

Author Icon By Vanipushpa
Updated: May 20, 2025 • 5:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌(Balochistan) లో నెలకొన్న పరిస్థితులపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ(Himanta Biswa Sarma) స్పందించారు. అపారమైన సహజ వనరులు, ఖనిజ సంపద ఉన్నప్పటికీ పాకిస్థాన్(pAKISTAN) ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆయన అన్నారు. దశాబ్దాలుగా బలూచిస్థాన్ ఆర్థికంగా, రాజకీయంగా దోపిడీకి గురవుతోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సీఎం హిమంత తన ‘ఎక్స్‌’ (X)ఖాతా ద్వారా పలు కీలక విషయాలను వెల్లడించారు.

Himanta Biswa Sarma: బలూచిస్థాన్‌ను పాకిస్థాన్ దోచుకుంటోంది: అసోం సీఎం

ఖనిజ సంపదకు బలూచిస్థాన్ నిలయం
“బలూచిస్థాన్ ప్రావిన్స్ అపారమైన ఖనిజ సంపదకు నిలయం. అయినా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో ఆర్థిక, రాజకీయ దోపిడీ రాజ్యమేలుతోంది” అని హిమంత తన పోస్టులో పేర్కొన్నారు. పాకిస్థాన్ మొత్తం ఖనిజ సంపదలో 80 శాతానికి పైగా బలూచిస్థాన్‌లోనే ఉన్నప్పటికీ, అక్కడి ప్రభుత్వం ఆ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. “ఆ ప్రాంతంలో భారీగా రాగి, బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంకా వెలికితీయని సుమారు 5.9 బిలియన్ టన్నుల ఖనిజాలు, 41.5 మిలియన్ ఔన్సుల బంగారం, 35 మిలియన్ టన్నుల రాగి నిల్వలు బలూచిస్థాన్‌లో ఉన్నాయి” అని హిమంత వివరించారు.
ప్రజలకు కనీసం స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదు
బలూచిస్థాన్‌లోని సుయ్ ప్రాంతంలో 1952లోనే గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నారని, 2020 నాటికి పాకిస్థాన్ దేశానికి అవసరమైన సహజ వాయువులో దాదాపు 56 శాతం ఇక్కడి నుంచే సరఫరా అవుతోందని హిమంత బిశ్వ శర్మ గుర్తు చేశారు. గ్వాదర్ ఓడరేవు, 770 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉన్నా, ఆ ప్రాంత ప్రజలకు కనీసం స్వచ్ఛమైన తాగునీరు, విద్యుత్, మౌలిక సదుపాయాలు కూడా అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో కూడా బలూచిస్థాన్ ప్రావిన్స్ వాటా చాలా తక్కువగా ఉందని ముఖ్యమంత్రి హిమంత అన్నారు. అపారమైన వనరులున్న ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ, అక్కడి ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నారని ఆయన తెలిపారు. “బలూచిస్థాన్‌లో వనరులకు కొరత లేదు. కానీ పాలకుల నిర్లక్ష్యం, రాజకీయ దోపిడీ విపరీతంగా ఉంది” అని హిమంత ఆరోపించారు.

Read Also: Pakistani PM: అమృత్​సర్​లోని గ్రామంలో ప్రధాని షెహబాజ్ పూర్వీకుల మూలాలు

#telugu News Ap News in Telugu Assam CM Breaking News in Telugu Google News in Telugu is looting Balochistan: Latest News in Telugu Pakistan Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.