📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pak Minister: భారత్ లో పాక్‌ సమాచార మంత్రి ఎక్స్‌ ఖాతా నిలిపివేత

Author Icon By Anusha
Updated: May 4, 2025 • 3:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కాశ్మీర్ లోని పహల్‌గామ్‌ ఉగ్రదాడితో పొరుగుదేశం పాకిస్థాన్‌పై భారత్‌ ఆంక్షలు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆ దేశానికి చెందిన పలువురు ట్విట్టర్ అకౌంట్లు, పలు యూట్యూబ్‌ ఛానళ్లపై బ్యాన్‌ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశ సమాచార శాఖ మంత్రి అతుల్లా తరార్‌ ఎక్స్‌ అకౌంట్‌ను భారత్‌లో నిలిపివేసింది.భారత్‌పై అతుల్లా తరార్‌ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌పై భారతదేశం యుద్ధం చేయబోతుందంటూ వ్యాఖ్యానించారు. గత నెల 30వ తేదీన అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆయన ప్రెస్‌ మీట్‌పెట్టి మాట్లాడారు. రాబోయే 24-36 గంటల్లో పాకిస్థాన్‌పై భారతదేశం దాడి చేస్తుందని సైనిక చర్యకు ప్రణాళిక రూపొందించినట్లుగా విశ్వసనీయ సమాచారం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే చట్టపరమైన కారణాల వల్ల ఆయన సోషల్‌ మీడియా ఖాతాను బ్లాక్‌ చేసినట్లు తెలుస్తోంది.గత నెల 22న పెహల్‌గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై దౌత్యపరమైన కఠిన చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇస్లామాబాద్‌పై పలు ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెహల్‌గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రభుత్వ అధికారిక ఎక్స్‌ అకౌంట్‌ను యాక్సెస్‌ చేయకుండా నిలిపివేసింది. పలువురు పాకిస్థాన్‌ జర్నలిస్టులకు చెందిన ఎక్స్‌ ఖాతాలను కూడా నిషేధించినట్లు తెలిసింది.

నిషేధం

తప్పుడు, రెచ్చగొట్టే, సున్నితమైన మతపరమైన అంశాల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్రం 16 పాకిస్థాన్‌ యూట్యూబ్‌ చానళ్లపై సోమవారం నిషేధం విధించింది. ఇందులో పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అఖ్తర్‌కు చెందిన యూట్యూబ్‌ చానల్‌ కూడా ఉన్నది.పాక్‌ సెలబ్రిటీలకు సంబంధించి ఇన్ స్టా ఖాతాలను ఇండియాలో బ్యాన్ చేశారు. ఇండియాలో వీరి పేజ్ ఎవ‌రైన యాక్సెస్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తే ఇండియాలో ఈ ఖాతా అందుబాటులో లేదు అని మెసేజ్ వ‌స్తుంది. హోం శాఖ సిఫారసు మేరకు డాన్‌ న్యూస్‌, జియో న్యూస్‌,సునో న్యూస్‌, ది పాకిస్థాన్‌ రెఫరెన్స్‌ తదితర యూట్యూబ్‌ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆ తర్వాత పాక్‌ రక్షణ మంత్రి ఎక్స్‌ ఖాతాను కూడా నిలిపివేసింది. జమ్ము కశ్మీర్‌పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో భారత్‌ చర్యలు చేపడుతోంది.

దాడి

గత నెల 22న మధ్యాహ్నం జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్‌గామ్‌ లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై చర్యలకు దిగింది. వీసాలు రద్దు, సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఔషధాల ఎగుమతి, పాకిస్థాన్‌ నటుల సినిమాలు బ్యాన్‌ చేసింది. 

Read Also: India: పాకిస్థాన్‌కు మరో షాక్‌.. దిగుమతులపై కేంద్రం నిషేధం!

#DigitalBan #india #PahalgamAttack #pakistan #Terrorism #XAccountBlocked Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.