📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Pakistan: దేశ భద్రత కోసం రక్షణ బడ్జెట్‌ను అమాంతం పెంచేసిన పాక్!

Author Icon By Vanipushpa
Updated: June 11, 2025 • 2:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్న వేళ, అంతర్గతంగా భద్రతా వైఫల్యాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం(Pakistan Government) కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ బడ్జెట్‌(Defence Budget)ను ఏకంగా 20 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పాక్ ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్(Aurangzeb) పార్లమెంటులో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో సైనిక వ్యయానికి పెద్దపీట వేశారు.
ఇరు దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు
తాజా బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, రక్షణ రంగానికి 2.55 లక్షల కోట్ల పాకిస్థానీ రూపాయలు (సుమారు 9 బిలియన్ డాలర్లు) కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఈ కేటాయింపులు 2.12 లక్షల కోట్ల రూపాయలు (సుమారు 7.44 బిలియన్ డాలర్లు)గా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. భారత పాలిత కశ్మీర్‌లో 26 మంది హిందూ యాత్రికుల మృతికి కారణమైన ఉగ్రదాడి అనంతరం, రెండు అణ్వస్త్ర దేశాల మధ్య క్షిపణులు, డ్రోన్ల దాడులు చోటుచేసుకున్నాయి.

Pakistan: దేశ భద్రత కోసం రక్షణ బడ్జెట్‌ను అమాంతం పెంచేసిన పాక్!

మే ఆరంభంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఇంకా చల్లారలేదు. ఈ నేపథ్యంలో దేశ రక్షణకే తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ స్పష్టం చేశారు. అయితే, మొత్తం ప్రజా వ్యయాన్ని 7 శాతం తగ్గించి 17.57 లక్షల కోట్ల రూపాయలకు (సుమారు 62 బిలియన్ డాలర్లు) పరిమితం చేసినప్పటికీ, రక్షణ వ్యయాన్ని గణనీయంగా పెంచడం గమనార్హం. పర్యావరణ మార్పుల వల్ల తీవ్రంగా నష్టపోతున్న పాకిస్థాన్, విద్య, వ్యవసాయం, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్ట నివారణ చర్యల కంటే రక్షణ రంగానికే అధిక నిధులు కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పెంపునకు గల వ్యూహాత్మక కారణాలను వెల్లడించిన షెహబాజ్
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ వ్యయ పెంపునకు గల వ్యూహాత్మక కారణాలను వివరించారు. “సాంప్రదాయ యుద్ధంలో భారత్‌ను ఓడించిన తర్వాత, ఇప్పుడు ఆర్థిక రంగంలో కూడా మనం వారిని అధిగమించాలి. కేవలం సైనికంగానే కాకుండా, ఆర్థికంగా కూడా పాకిస్థాన్ ముందుకు సాగాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవలి సంక్షోభాల సమయంలో, ముఖ్యంగా ‘ఆప‌రేష‌న్‌ సిందూర్’ ఘటనలో పాకిస్థాన్ సైనిక దళాల సన్నద్ధత, ప్రతిస్పందన సామర్థ్యంలోని లోపాలు బహిర్గతమయ్యాయని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సైనిక సామర్థ్యాన్ని పునరుద్ధరించుకోవడానికి, దేశీయంగా సాయుధ బలగాలపై విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఈ బడ్జెట్ పెంపు ఒక రక్షణ వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై తీవ్రంగా స్పందించింది. దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న ఉగ్రవాదంపై ‘ఆపరేషన్ సింధూర్’ ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో మొదటి దశ విజయవంతంగా ముగిసినప్పటికీ, అనూహ్యంగా భారత్ కాల్పుల విరమణ (Ceasefire) ప్రకటించడం వివాదంగా మారింది.

Read Also: Al Qaeda: ట్రంప్ ను చంపేస్తామని అల్ ఖైదా హెచ్చరిక..

#telugu News Ap News in Telugu Breaking News in Telugu drastically for national security! Google News in Telugu Latest News in Telugu Pakistan has increased its defense budget Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.