📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Operation Sindoor : కాళ్లబేరానికి పాకిస్తాన్ ? భారత్ కు ఉపప్రధాని కీలక ప్రతిపాదన..!

Author Icon By Sudha
Updated: May 10, 2025 • 2:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం దాడికి ప్రతీకారం భారత్ మొదలుపెట్టిన ఆపరేషన్ సిందూర్ తో (Operation Sindoor )పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే పలు ఆర్మీ బేస్ లతో పాటు సరిహద్దుల్లోనూ భారీగా నష్టం చవిచూస్తున్న పాకిస్తాన్ కు అణ్వాయుధాల ప్రయోగం మినహా మరో దారి కనిపించడం లేదు. అదే సమయంలో వెనక్కి తగ్గాలని అమెరికా లాస్ట్ వార్నింగ్ ఇచ్చేసింది. ఇలాంటి పరిస్దితుల్లో పాకిస్తాన్ ఉపప్రధాని, విదేశాంగమంత్రి ఇషాక్ దార్ (Ishaq dar)భారత్ కు ఓ కీలక ప్రతిపాదన చేశారు. దీనికి భారత్ అంగీకరిస్తే తాము కూడా అందుకు సిద్ధమని వెల్లడించారు.

Operation Sindoor : కాళ్లబేరానికి పాకిస్తాన్ ? భారత్ కు ఉపప్రధాని కీలక ప్రతిపాదన..!

రెండు రోజులుగా పాకిస్తాన్ వైమానిక దళ, సైనిక స్థావరాలపై భారత్ ఖచ్చితమైన వైమానిక దాడులు జరుపుతుంండంతో పాకిస్తాన్ ‘ఆపరేషన్ బన్యన్-అన్-మర్సూస్’పేరుతో ఎదురుదాడిని మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. అయితే పాకిస్తాన్ కొత్త ఆపరేషన్ ను సైతం భారత బలగాలు సమర్ధంగా అడ్డుకుంటున్నాయి. దీంతో తాజా పరిణామాల్ని గమనిస్తున్న పాకిస్తాన్ ఉపప్రధాని,విదేశాంగమంత్రి ఇషాక్ దార్ భారత్ ముందు కీలక ప్రతిపాదన చేశారు.
ప్రతీకారం తీర్చుకోము
భారతదేశం తన సైనిక దాడిని ఆపితే తమ దేశం ఇక్కడే ఆగడాన్ని పరిశీలిస్తుందని పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. ప్రస్తుతం తమ దేశంలో నెలకొన్న ప్రతికూల పరిస్దితుల నేపథ్యంలో పాకిస్తాన్ ఉద్రిక్తతను తగ్గించాలని కోరుకుంటుందని , భారత్ తో చర్చల కోసం కొత్త కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకున్నట్లు ఆ దేశ ప్రభుత్వ ఉన్నత వర్గాలు సీఎన్ఎన్ న్యూస్ కు వెల్లడించాయి. వాళ్ళు ఆగిపోతే, మేం కూడా అలాగే చేస్తామని ఇషాక్ దార్ తెలిపారు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని, భారతదేశం ఈ సమయంలో ఆగిపోతే మనం కూడా శాంతిని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ప్రతీకారం తీర్చుకోమని, ఏమీ చేయమని కూడా చెప్పుకొచ్చారు. తాము నిజంగా శాంతిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా భారత్ సరిహద్దులో తన కార్యకలాపాలను నిలిపివేస్తే తదుపరి చర్యలకు దూరంగా ఉండటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో భారత్ దాడులు పాకిస్తాన్ ను ఏ స్ధాయిలో ఇబ్బందులు పెడుతున్నాయనో అర్దమవుతోంది. ఇప్పటికే భారత దాడులకు తట్టుకోలేక పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ సైతం దేశం విడిచి పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం యుద్ధంపై స్పందించకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

Read Also : India – Pakistan War : మరోసారి పాక్ డ్రోన్ అటాక్

#telugu News Breaking News in Telugu Deputy Prime Minister's Google news Google News in Telugu key proposal to India..! Latest News in Telugu Operation Sindoor Pakistan for a foot bargain? Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.