📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

India Pakistan war: భారత గగనతలంలోకి పాక్ క్షిపణులు.. తిప్పికొట్టిన ఇండియా

Author Icon By Vanipushpa
Updated: May 8, 2025 • 5:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల పొలాల్లో లభ్యమైన క్షిపణి శకలాలు ఎక్కడివన్నది తేలిపోయింది. అవి పాక్ ప్రయోగించగా, భారత్ వాటిని మార్గమధ్యంలోనే తుత్తునియలు చేసింది. భారత నగరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ప్రయోగించిన క్షిపణులను భారత వాయుసేన సమర్థవంతంగా తిప్పికొట్టింది. రష్యా నుంచి సమకూర్చుకున్న అత్యాధునిక ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (సుదర్శన చక్ర) ద్వారా సుమారు 15 పాక్ క్షిపణులను కూల్చివేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామం అనంతరం, పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ రాడార్ వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఇజ్రాయెల్ తయారీ హార్పీ డ్రోన్లను భారత్ ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో లాహోర్‌లోని కీలక రాడార్‌తో సహా పలు వ్యవస్థలు ధ్వంసమైనట్లు సమాచారం.

India Pakistan war: భారత గగనతలంలోకి పాక్ క్షిపణులు.. తిప్పికొట్టిన ఇండియా

‘కదిలే లక్ష్యాల’ను పసిగట్టిన ఎస్-400
వార్తా సంస్థ ఏఎన్ఐ కథనం ప్రకారం, భారత గగనతలంలోకి ప్రవేశిస్తున్న ‘కదిలే లక్ష్యాల’ను పసిగట్టిన ఎస్-400 వ్యవస్థ, వాటిని విజయవంతంగా అడ్డుకుంది. దీని తర్వాత, శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలను అణచివేయడంలో ప్రసిద్ధి చెందిన హార్పీ డ్రోన్లను భారత్ రంగంలోకి దించింది. ఈ డ్రోన్లు శక్తివంతమైన పేలుడు పదార్థాలను మోసుకెళ్లడమే కాకుండా, రేడియేషన్ వెలువరించే లక్ష్యాలను స్వయంగా గుర్తించి, వాటిపై దాడి చేయగల ప్రత్యేక నేవిగేషన్ వ్యవస్థను కలిగి ఉంటాయి. నిర్దేశిత ప్రాంతంలోని లక్ష్యాలను ఏ దిశ నుంచైనా ఛేదించగల సామర్థ్యం వీటికి ఉంది. పగలు, రాత్రి వేళల్లో సుమారు తొమ్మిది గంటల పాటు సుదూర లక్ష్యాలపై దాడులు చేయగలవని నిపుణులు చెబుతున్నారు.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం
కాగా, భారత్ ‘సుదర్శన చక్ర’గా అభివర్ణించే ఎస్-400 రక్షణ వ్యవస్థలు, ప్రపంచంలోనే అత్యంత ఆధునాతనమైనవిగా పేరుపొందాయి. ఇవి దాదాపు 600 కిలోమీటర్ల దూరం నుంచే శత్రు క్షిపణులను గుర్తించి, 400 కిలోమీటర్ల పరిధిలో వాటిని కూల్చివేయగలవు. ఈ తాజా పరిణామాలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేసిన మరుసటి రోజే, పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలపై డ్రోన్లతో దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా కరాచీ, లాహోర్ వంటి ప్రధాన నగరాలపై ఈ దాడులు జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) అభివృద్ధి చేసిన హార్పీ డ్రోన్లను భారత్ ఉపయోగించినట్లు తెలుస్తోంది.
హార్పీ డ్రోన్ల ప్రత్యేకతలు
ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) అభివృద్ధి చేసిన హార్పీ డ్రోన్ వ్యవస్థను తొలిసారిగా 1989లో ప్రవేశపెట్టారు. అనేక ఆధునిక మార్పులతో ఇది మరింత శక్తివంతంగా తయారైంది. ముఖ్యంగా, హార్పీ ఎన్‌జీ (నెక్స్ట్ జనరేషన్) వేరియంట్, ‘ఫైర్ అండ్ ఫర్గెట్’ పద్ధతిలో పనిచేసే స్వతంత్ర ఆయుధంగా పేరుగాంచింది. ఇది శత్రు రాడార్ వ్యవస్థలను గుర్తించి, అకస్మాత్తుగా వాటిపై పడిపోతుంది. ఆత్మాహుతి దాడికి పాల్పడి లక్ష్యాలను నాశనం చేస్తుంది. ప్రధానంగా శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే దీని లక్ష్యం. ఐఏఐ ప్రకారం, హార్పీ ఎన్‌జీ ఒక వ్యూహాత్మక ఆయుధం. దీనిని భూమిపై నుంచైనా లేదా నౌకల్లోని కానిస్టర్ల నుంచైనా ప్రయోగించవచ్చు. సుదూర లక్ష్యాలను ఛేదించగల ఈ డ్రోన్లు, శత్రు గగనతలంలో సురక్షిత మార్గాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఐఏఐ ఇతర అధునాతన డ్రోన్లు
ఐఏఐ రూపొందించిన సుదూర లక్ష్య ఛేదిత గాల్లో చక్కర్లు కొట్టే ఆయుధాల (long-range loitering munitions) జాబితాలో హార్పీ ఎన్‌జీతో పాటు హారోప్, మినీ హార్పీ కూడా ఉన్నాయి. హారోప్ డ్రోన్, హార్పీ నుంచి అభివృద్ధి చేయబడింది. ఇది భూమి, నౌకల నుంచి ప్రయోగించగలదు మరియు కదిలే, స్థిర లక్ష్యాలపై దాడి చేయగలదు. మినీ హార్పీ ట్రిపుల్ సీకర్ వ్యవస్థతో ప్రతికూల వాతావరణంలోనూ లక్ష్యాలను ఛేదించగలదు.

Read Also: Missile Parts : అమృత్‌సర్‌లో హైఅలర్ట్‌..గాల్లోనే ధ్వంసమైన పాకిస్తాన్ మిస్సైల్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu India repels them into Indian airspace Latest News in Telugu Pakistan fires missiles Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.