📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan’s Defence Minister: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Author Icon By Vanipushpa
Updated: May 8, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. భారత్‌పై ఎదురుదాడికి దిగబోయి బొక్క బోర్లా పడ్డారు. దీనిపై యాంకర్ పలు ప్రశ్నలు సంధించారు ఖవాజా ఆసిఫ్‌కు. ఏ ప్రాంతంలో వాటిని కూల్చివేశారు?.. సాక్ష్యాధారాలు ఉన్నాయా? అని అడిగారు. దేశ రక్షణ శాఖ మంత్రిగా పూర్తి సమాచారం అందిందా? అంటూ గుచ్చి గుచ్చి ప్రశ్నించారు.

వీటికి సరైన సమాధానాలు ఇవ్వడంలో విఫలం అయ్యారు ఖవాజా ఆసిఫ్. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, భారత్‌పై జరిగిన ఆపరేషన్ సింధూర్ ఘటనపై ఇచ్చిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో ఆయన స్పష్టత లేనట్లుగా కనిపించారు.

Pakistan’s Defence Minister :పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద

సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా
సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ సమాచారాన్ని ధృవీకరించుకున్నామని చెప్పారు. భారత జెట్ ఫైటర్ల కూల్చివేతకు సంబంధించిన సమాచారం అంతా సోషల్ మీడియాలో ఉందని పేర్కొన్నారు. అది కూడా భారత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై పబ్లిష్ అయ్యాయని చెప్పుకొచ్చారు. రాఫెల్, మిగ్ సహా ఆయా యుద్ధ విమానాల శకలాలు భారత భూభాగంపై పడ్డాయని, దీనిపై ఖచ్చితమైన సమాచారం ఆ దేశ మీడియా వద్ద ఉందని ఆసిఫ్ బదులు ఇచ్చారు. యుద్ధ విమానాల కూల్చివేతపై ఎలాంటి అధికారిక సమాచారం తన వద్ద లేదని, సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించామని అంగీకరించారు.
ఖవాజా ఆసిఫ్ ఆందోళన వ్యక్తం
భారత్‌తో ఏర్పడిన ఈ ఘర్షణ.. పూర్తి స్థాయి యుద్ధంగా మారే అవకాశాలు లేకపోలదని ఖవాజా ఆసిఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని నివారించడానికి తమవంతుు ప్రయత్నాలు సాగిస్తోన్నామని చెప్పారు. తమ దేశ గగనతలంపైకి దూసుకొచ్చిన భారత వైమానిక దళాలు.. దాడులు సాగించాయని, ఇది ప్రమాదకర సంకేతమని వ్యాఖ్యానించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆసిఫ్ చెప్పారు. భారత్ వెనక్కి తగ్గితే.. డీ-ఎస్కలేషన్‌ సాధ్యపడుతుందని అన్నారు.

భారత్‌తో ఏర్పడిన ఉద్రిక్తతలు, ఘర్షణ వైఖరిని పూర్తిస్థాయిలో తగ్గించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. భారత జెట్‌ ఫైటర్లను కూల్చివేసేందుకు పాకిస్తాన్.. చైనా పరికరాలను ఉపయోగించిందా అని యాంకర్ ప్రశ్నించగా లేదని సమాధానం ఇచ్చారు ఆసిఫ్. తమ వద్ద చైనా విమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న జేఎఫ్-17, జేఎఫ్-10 ఎయిర్ క్రాఫ్ట్స్ చైనాకు చెందినవేనని అన్నారు. అవి ఇప్పుడు పాకిస్తాన్‌లో తయారవుతున్నాయి, ఇక్కడే అసెంబుల్ చేస్తున్నారని వివరించారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆసిఫ్ స్పందిస్తూ, భారత జెట్ ఫైటర్లను కూల్చివేయడానికి చైనా పరికరాలు వాడలేదని చెప్పారు. అయితే పాకిస్తాన్ వద్ద ఉన్న JF-17, JF-10 వంటి యుద్ధ విమానాలు చైనా సహకారంతో రూపొందించబడినవని, ఇప్పుడు అవి పాకిస్తాన్‌లోనే అసెంబుల్ అవుతున్నాయని వివరించారు.

Read Also: Operation Sindhur: భారత్ దాడులతో పాకిస్థాన్‌లో రెడ్ అలర్ట్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu controversial remarks Google News in Telugu Khawaja Asif's Latest News in Telugu Pakistan Defense Minister Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.