📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Operation Sindoor: పాక్ సైన్యం విలవిల.. భారీ ప్రాణ నష్టం..!!

Author Icon By Vanipushpa
Updated: May 8, 2025 • 4:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ (pakistan) అష్టదిగ్భందనంలో చిక్కుకుంది. దౌత్య పరంగా ఏకాకి అయింది. భారత్ ఆపరేషన్ సింధూర్ తో పై చేయి సాధించింది. పాక్ భూ భాగంలోని ఉగ్ర శిబిరాలను నేల మట్టం చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టు బెట్టింది. భారత్ దాడులకు కనీస ప్రతిఘటన ఇవ్వలేక పోయింది. భారత్ అనుకున్నది చేసిందంటూ పాక్ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన బలుచిస్తాన్ ఆర్మీ (balochistan army) వరుస దాడులకు పాక్ సైన్యాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరుగుతోంది. దీంతో.. పాక్ విలవిల్లాడుతోంది.

Operation Sindoor: పాక్ సైన్యం విలవిల.. భారీ ప్రాణ నష్టం..!!

ఉగ్రవాదులను మట్టు బెట్టింది
పాకిస్తాన్ ను భారత్ ఆపరేషన్ సింధూర్ తో చావు దెబ్బ కొట్టింది. పాక్ తో పాటుగా పీఓకేలోని ఉగ్ర శిబిరాల పై గురి పెట్టి కూల్చి వేసింది. ఉగ్రవాదులను మట్టు బెట్టింది. సరిగ్గా ఇదే సమయంలో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ పై పట్టు బిగించే ప్రయత్నం చేస్తోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌ లోని బోలాన్, కెచ్ ప్రాంతంలో రెండు వరుస దాడులకు దిగింది. ఇందులో 14 మంది పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది మరణించారు. బోలాన్‌లోని మాచ్‌లోని షోర్కాండ్ ప్రాంతంలో పాక్ సైనిక కాన్వాయ్‌పై రిమోట్-కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ దాడి చేసింది. శక్తివంతమైన పేలుళ్లలో వాహనంలో ప్రయాణిస్తున్న 12 మంది సైనికులు మరణించారు. వీరిలో స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిఖ్ ఇమ్రాన్, సుబేదార్ ఉమర్ ఫరూక్ ఉన్నారు.
దాడిలో ఇద్దరు పాక్ ఆర్మీ సిబ్బంది మృతి
రెండవ సంఘటనలో బలూచ్ కార్యకర్తలు కెచ్‌లోని కులగ్ టిగ్రాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.ఈ దాడిలో ఇద్దరు పాక్ ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. చాలా కాలంగా బలూచిస్తాన్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని పోరాటం చేస్తున్నారు. పాకిస్థాన్‌ ఎప్పటికప్పుడు వారిని అణచివేస్తూ వస్తోంది. ఇటు భారత్ పాక్ లోని ఉగ్రవాద శిబిరాల పైన గురి పెట్టి 23 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేసింది. ఈ దాడితో పాకిస్థాన్‌ అతలాకుతలమైంది. పాకిస్థాన్‌ ఆర్మీ ఫోకస్‌ మొత్తం ఇండియాపైనే పెట్టింది. ఇక ఇదే సందు అనుకొని.. బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ పాకిస్థాన్‌ సైనికులపై దాడులకు పాల్పడుతూ.. పాకిస్థాన్‌ను మరింత ఇబ్బంది పెడుతోంది. ఇలా ఒక వైపు ఇండియా, మరోవైపు బలూచిస్థాన్‌ దాడులతో పాకిస్థాన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతుంది.

Read Also: Operation Sindoor: పాక్ యుద్ధం వేళ రాజస్థాన్‌, పంజాబ్‌లలో హై అలర్ట్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Heavy loss of lives..!! Latest News in Telugu Pakistan army retreats Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.