📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Pakistan: కాశ్మీర్‌ పై పాక్‌ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు

Author Icon By Vanipushpa
Updated: April 17, 2025 • 4:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీయుల సమావేశంలో ప్రసంగించిన జనరల్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో ఉన్న వారంత దేశ రాయబారులని.. ఉన్నతమైన భావజాలం.. సంస్కృతికి చెందినవారన్న విషయాన్ని మరిచిపోకూడదని ఆయన అన్నారు. దేశం ఏర్పాటు కోసం మన పూర్వీకులు ఎంతగానో పోరాటం చేశారని తెలిపారు. దేశంతో వారి బంధం బలహీనపడకుండా ఉండేందుకు మీ పిల్లలకు పాకిస్థాన్ చరిత్రను తెలియజేయాలన్నారు. హిందువులతో పోలిస్తే.. తాము భిన్నమైన వారని.. తమ సంస్కృతి, సంప్రదాయాలు, ఆశయాలు అన్ని భిన్నంగా ఉంటాయని తెలిపారు. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసిందని అసిమ్ మునీర్ అన్నారు.

భారత సైనికులే పాకిస్థాన్‌ను భయపెట్టలేకపోయారు
ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్తాన్‌కు పెట్టుబడులు రాకపోవచ్చని చాలామంది భయపడుతున్నారని జనరల్ మునీర్ అన్నారు. 13 లక్షల భారత సైనికులే పాకిస్థాన్‌ను భయపెట్టలేకపోయారని.. అలాంటిది ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును హరించగలరని మీరు భావిస్తున్నారా..? అని కీలక వ్యాఖ్యలు చేశారు. బలూచిస్తాన్‌లో వేర్పాటువాద ఉద్యమాలపై సాయుధ దళాలు కఠినంగా వ్యవహరిస్తాయని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. కాశ్మీరీ ప్రజల స్వీయ నిర్ణయ హక్కు కోసం పాకిస్థాన్ తన మద్దతును కొనసాగిస్తుందని, ఐక్యరాష్ట్ర సమితి తీర్మానాలకు అనుగుణంగా వారి పోరాటానికి రాజకీయ, దౌత్యపరమైన సహకారం అందిస్తుందని ఆయన అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, విదేశాల్లో నివసించే పాకిస్తానీయులతో జరిగిన సమావేశంలో జాతియ భావజాలం, పాక్ చరిత్ర, భారత వ్యత్యాసాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. “విదేశాల్లో ఉన్న ప్రతీ పాకిస్తానీయుడు దేశానికి రాయబారి వంటివారు.”
“మీ పిల్లలకు పాకిస్తాన్ చరిత్రను తెలియజేయాలి, దేశంతో వారి బంధం బలహీనపడకూడదు.” అని ఆయన అన్నారు.

Read Also: Stock Market: దుమ్ములేపుతున్న స్టాక్ మర్కెట్.. 1500 పెరిగిన సెన్సెక్స్..

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu key remarks on Kashmir Latest News in Telugu Pakistan Army Chief Asim Munir's Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.