📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Owaisi: సౌదీలో పాకిస్థాన్ ను తీవ్రంగా విమర్శించిన అసదుద్దీన్ ఒవైసీ

Author Icon By Anusha
Updated: May 29, 2025 • 4:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్ పట్ల తన వ్యతిరేక విధానాన్ని హిందూ-ముస్లిం సమస్యగా చూపించేందుకు పాకిస్థాన్ చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఆయన ఎండగట్టారు. భారత్‌లో 24 కోట్ల మందికిపైగా ముస్లింలు ఉన్నారని గర్వంగా చెప్పుకోగలమని, భారత్‌కు ఎంతో మంది గొప్ప ఇస్లామిక్ పండితులు ఉన్నారని ఆయన అన్నారు. ‘పాకిస్థాన్ అరబ్ దేశాలు ముస్లిం ప్రపంచానికి తప్పుడు సందేశాన్ని ఇస్తోంది.మా ఇస్లామిక్ పండితులు ప్రపంచంలోని ఎవరితోనైనా వాదించగలరు. వారు అద్భుతమైన అరబిక్ మాట్లాడగలరు. భారత్ ముస్లింలపై దాడులు చేస్తోందని పాకిస్థాన్ చెబుతోంది ఇది పూర్తిగా దుష్ప్రచారం’’ అని ఒవైసీ(Asaduddin Owaisi) తెలిపారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతివ్వడాన్ని ఆ దేశం ఆపితే, దక్షిణాసియాలో స్థిరత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు.

స్థావరాలే

పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్అనంతరం భారత ప్రభుత్వం చేపట్టిన అంతర్జాతీయ దౌత్య కార్యక్రమంలో భాగంగా అసదుద్దీన్ ఒవైసీతో కూడిన భారతీయ ప్రతినిధి బృందం సౌదీ అరేబియా చేరుకుంది. సౌదీ ప్రభుత్వ ఉన్నతాధికారులు, పాలకులను ఈ బృందం కలిసి భారత్‌పై పాకిస్థాన్ చేస్తోన్న కుట్రలను వివరించింది. ఈ సందర్భంగానే ఒవైసీ మాట్లాడుతూ పాక్‌పై తీవ్ర విమర్శలు చేశారు.మే 9 ఘటనను ప్రస్తావిస్తూ భారత సైనిక శక్తిపై పాకిస్థాన్ దుష్ప్రచార చేసిందని విమర్శించారు. ‘ఆ రోజున వారి తొమ్మిది వైమానిక స్థావరాలే లక్ష్యంగా(Nine air bases are targeted. దాడులు జరిపాం. భారత్‌ తలచుకుంటే వాటిని పూర్తిగా ధ్వంసం చేయవచ్చు. కానీ మేము హెచ్చరికలు మాత్రమే చేశాం ‘ మే 7న తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేశాం.అని ఆయన వెల్లడించారు.పాకిస్థాన్‌ను మళ్లీ ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేర్చాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ‘ఉగ్రవాదులకు నిధులను అడ్డుకునే మార్గం అదే.

Owaisi: సౌదీలో పాకిస్థాన్ ను తీవ్రంగా విమర్శించిన అసదుద్దీన్ ఒవైసీ

అనుసరించి

ముంబయి 26/11 ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ, మన్మోహన్ సింగ్(Manmohan Singh) ప్రభుత్వమే అన్ని ఆధారాలను పాకిస్థాన్‌కు అప్పగించిందని చెప్పారు.‘భారత్‌ న్యాయ ప్రక్రియను అనుసరించి అజ్మల్ కసబ్‌కు మరణశిక్ష విధించింది. అతడు విచారణలో పలు విషయాలను వెల్లడించాడు. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలను మా ఏజెన్సీలు రికార్డ్ చేశాయి.’‘భయపడకండి, ఎక్కువ మందిని చంపండి.. మీకు జన్నత్ లభిస్తుంది అని వారు (పాక్) ఉగ్రవాదులను ఉత్సాహపరిచారు’ అని ఒవైసీ వివరించారు.

Read Also: POK: పీఓకే మనదేనంటూ రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

#AsaduddinOwaisi #IndiaMuslims #OwaisiOnPakistan #ProudIndianMuslims Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.