ఆపరేషన్ సిందూర్ పేరుతో పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఒక రాత్రిలోనే మూడు టెర్రర్ హెడ్‌క్వార్టర్స్ నేలమట్టం చేసింది. 26/11 దాడులకు ప్రతీకారంగా మురిడ్కేలో ఆర్మీ దాడులు చేసింది. పుల్వామా ఎటాక్‌కి ప్రతీకారంగా బహావల్‌పూర్‌లో మెరుపు దాడులు చేసింది.పాకిస్తాన్ తో పాటుగా పీఓకే లోని ఉగ్రవాద శిబిరాల పైన అర్ద్రరాత్రి భారత సైన్యం మెరుపు దాడి చేసింది. డ్రోన్లు, క్షిపణులతో భారత ఏయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద శిబిరాల పైన పక్కా సమాచారంతో గురి పెట్టి మరీ భారత సైన్యం, క్షిపణులు ప్రయోగించింది. ఉగ్రవాద శిబిరాల పైన భారత్ సైన్యం దాడులను దేశ వ్యాప్తంగా అందరూ సమర్థిస్తున్నారు. సైన్యాన్ని అభినందిస్తూ సందేశాలు ఇస్తున్నారు. ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఈ ప్రతీకార దాడుల పైన స్పందించారు. కీలక ప్రతిపాదన తెర మీదకు తెచ్చారు.ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టు బెట్టారు. కేవలం గంట ల వ్యవధిలో గురి పెట్టి మరీ ఉగ్రవాద ప్రధాన స్థావరాలను నేల మట్టం చేసారు. సైన్యం ఆపరేషన్ పైన దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. రాజకీయాలకు అతీతంగా అందరూ కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఎంఐఎం అధినేత ఈ స్ట్రైక్స్ పైన స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆపరే షన్ సింధూర్‌కు అభినందనలు తెలిపారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారత రక్షణ బలగా లు లక్ష్యంగా చేసుకున్న దాడులను తాను స్వాగతిస్తున్నానని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఇదే సమయంలో కొత్త డిమాండ్ చేసారు.
ఉగ్రవాదులు
పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఓవైసీ కోరారు. పాకిస్థాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలని తెలిపారు. జై హింద్! ఆపరేషన్ సింధూర్ అని అసదుద్దీన్ ఒవైసీ పూర్తి మద్దతు పలికారు. ఆపరేషన్ సింధూర్ లో దాదాపు 80 మంది వరకు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు.ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల ను భారత సైన్యం మరి కాసేపట్లో వెల్లడించనుంది. ఒక్క సారిగా జరిగిన దాడుల్లో ఉగ్రవాదుల క్యాంపుల్లో శిక్షణ పొందుతున్న వారు మరణించారు. జైషే ఈ మహ్మద్, లష్కర్ తోయిబా అగ్ర నేతలు సైతం హతం అయినట్లు తెలుస్తోంది. పాక్ తో సహా పీవోకేలోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది. బహావల్‌పూర్, కోట్లీ, ముజఫరాబాద్‌పై క్షిపణి దాడులు చేసింది. బహావల్‌పూర్‌లో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ప్రముఖులు
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రశంసిస్తూ ‘భారత్ మాతా కీ జై, హర్ హర్ మహాదేవ్, జై హింద్’ అంటూ నినాదాలతో తన మద్దతు తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా పాకిస్థాన్‌పై జరిగిన ఈ దాడులను స్వాగతించారు. “‘ఆపరేషన్ సిందూర్’ – కచ్చితమైనది, కనికరం లేనిది, క్షమించరానిది. భారతదేశం దాడులు చేస్తే, అది వేగంగా, ఖచ్చితంగా ఉంటుంది. మన బలగాలు దెబ్బతీయాల్సిన చోట దెబ్బతీశాయి.భారత్‌తో పెట్టుకుంటే మూల్యం చెల్లించాల్సిందే. మన వీర సైనికులను చూసి గర్విస్తున్నాను! మేరా భారత్ మహాన్, జై హింద్!” అని బండి సంజయ్ తన పోస్టులో పేర్కొన్నారు.
Read Also : Friedrich Merz : జర్మనీ రాజకీయాల్లో చారిత్రక పరిణామం