📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Bilawal Bhutto: అంతర్జాతీయ వేదికలపై మా ప్రయత్నాలు ఫలించలేదు: బిలావల్

Author Icon By Vanipushpa
Updated: June 4, 2025 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతర్జాతీయ వేదికలపై తమ దేశానికి ఎదురవుతున్న పరాజయాలను పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో (Bilawal Bhutto) స్వయంగా అంగీకరించారు. ముఖ్యంగా కశ్మీర్అం(Kashmir)శాన్ని ఐక్యరాజ్యసమితి(UNO)లో ప్రస్తావించేందుకు చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని ఆయన వాపోయారు. అమెరికా(America) పర్యటనలో ఉన్న బిలావల్, న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇతర వేదికలపైనా ఎదురుదెబ్బలు తగిలాయి
ఆపరేషన్ సిందూర్‌పై ఏర్పాటైన భారత అఖిలపక్షం తరహాలోనే పాకిస్థాన్ కూడా బిలావల్ భుట్టో నేతృత్వంలో ఒక పార్లమెంట్ సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం అమెరికా పర్యటనలో భాగంగా…. ఐరాసలో ఆయన మాట్లాడుతూ, “కశ్మీర్‌ అంశానికి సంబంధించినంత వరకు మనం ఎదుర్కొంటున్న అడ్డంకులు ఇప్పటికీ ఉన్నాయి. దీంతోపాటు ఇతర వేదికలపైనా ఎదురుదెబ్బలు తగిలాయి” అని బిలావల్ పేర్కొన్నారు.రెండు అణ్వస్త్ర దేశాలైన భారత్, పాకిస్థాన్‌ల మధ్య వివాదాల పరిష్కారానికి ఒక వ్యవస్థను తీసుకురావడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఉగ్రవాదంపై పోరు విషయంలో ఆసక్తికరమైన సూచన చేశారు.

Bilawal Bhutto: అంతర్జాతీయ వేదికలపై మా ప్రయత్నాలు ఫలించలేదు: బిలావల్

ఇరు దేశాల మధ్య నిరంతర ఘర్షణ వాతావరణం
“మా రెండు దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఐఎస్‌ఐ (ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్), రా (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) కలిసి కూర్చొని, ఈ ఉగ్రవాద శక్తులపై పోరాటం కోసం కలిసి పనిచేస్తే, ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గిపోతాయని నేను భావిస్తున్నాను” అని బిలావల్ అన్నారు. ఇరు దేశాల మధ్య నిరంతర ఘర్షణ వాతావరణం విద్రోహ శక్తులను మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ తీవ్రవాద చరిత్ర
గతంలో కూడా బిలావల్ భుట్టో తన దేశానికి సంబంధించిన కొన్ని వాస్తవాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. ఉగ్రవాద సంస్థలతో పాకిస్థాన్‌కు గతంలో సంబంధాలున్నాయనేది వాస్తవమేనని ఆయన ఇటీవల అంగీకరించారు. స్థానిక మీడియాతో మాట్లాడుతూ, “పాకిస్థాన్‌కు ఒక గతం ఉందనేది రహస్యం కాదని నేను భావిస్తున్నా. దాని ఫలితంగా మనం బాధపడ్డాం. పాకిస్థాన్ నష్టపోయింది. ఆ పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఈ సమస్య పరిష్కారానికి అంతర్గత సంస్కరణలు చేపట్టాం. పాకిస్థాన్ తీవ్రవాద చరిత్ర తిరస్కరించలేనిది. అయితే, అది ముగిసిన అధ్యాయం. అది మన చరిత్రలో ఒక దురదృష్టకరమైన భాగం” అని బిలావల్ పేర్కొన్నారు.

Read Also: Sana: యూట్యూబర్‌‌ సనాను ఎందుకు హత్య చేశారు?

#telugu News Ap News in Telugu Bilawal Breaking News in Telugu Google News in Telugu have not been fruitfu Latest News in Telugu Our efforts at international forums Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.