📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Opal Suchata: ప్రియాంక చోప్రా అంటే చాలా ఇష్టం: మిస్​ వరల్డ్ సుచాత

Author Icon By Anusha
Updated: June 1, 2025 • 4:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మిస్ వరల్డ్ 2025 పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ అందాల పోటీలలో ఆమె విజేతగా నిలిచి, అంతర్జాతీయ స్థాయిలో థాయ్‌లాండ్‌(Thailand)కు గౌరవాన్ని తెచ్చింది. ఈ పోటీల్లో ఇథియోపియా(Ethiopia) సుందరి 1వ రన్నరప్‌గా నిలవగా, పోలండ్ 2వ రన్నరప్‌గా, మార్టినిక్ 3వ రన్నరప్‌గా నిలిచాయి. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు ఈ ప్రతిష్టాత్మక పోటీలలో పాల్గొన్నారు. విజేతగా ఎంపికైన సుచాతాకు రూ. 8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది.ఈ నేపథ్యంలో నేషనల్ మీడియాతో మాట్లాడారు. భారతీయ చిత్రాలతోపాటు పలువురు నటీనటుల గురించి మాట్లాడారు.ప్రత్యేకించి భారత్‌కు చెందిన మిస్ వరల్డ్‌లు తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.

వ్యక్తిత్వం

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం,” అంటూ మొదలుపెట్టిన సుచాతా, “నాకు మానుషి చిల్లర్ అంటే ఎంతో ఇష్టం. ఆమెను మిస్ వరల్డ్ ఫినాలేలో కలిసే అవకాశం లభించింది. మానుషి చాలా చక్కటి వ్యక్తిత్వం కలిగినవారు. ఆమె వ్యక్తిగతంగా మాట్లాడిన తీరు, ప్రొఫెషనల్ ఆచరణ నన్నెంతో ఆకట్టుకున్నాయి,” అని పేర్కొన్నారు.నాకు ప్రియాంక చోప్రా అంటే ఎంతో ఇష్టం.ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుని, బాలీవుడ్,అంతర్జాతీయ సినీ రంగాలలో గొప్ప గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.ఆమె నుంచి స్ఫూర్తి పొందాను. వీలున్నప్పుడు సినిమాలు చూస్తుంటా. బాలీవుడ్‌లో తెరకెక్కిన పలు చిత్రాలు ఇప్పటికే చూశాను.

Opal Suchata: ప్రియాంక చోప్రా అంటే చాలా ఇష్టం: మిస్​ వరల్డ్ సుచాత

అద్భుతమైన

అలియాభట్ నాకు తెలుసు అని తెలిపారు సుచాత. “అలియా నటించిన గంగూబాయి కథియావాడి నాకెంతో నచ్చింది. ప్రేక్షకులను ఆలోచింప చేసే చిత్రమది. బాహుబలి సినిమా గురించి విన్నాను. కానీ ఆ మూవీ ఇంకా చూడలేదు. మిస్​ వరల్డ్ పోటీల్లో భాగంగా కొన్నిరోజుల క్రితం మేమంతా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీ(Ramoji Film City) సందర్శించాం. పోటీలు పూర్తైన తర్వాత ఖచ్చితంగా ఆ సినిమా చూడాలని నాకు నేనే ఒట్టు వేసుకున్నా. మళ్లీ నేను ఇక్కడికి వచ్చే నాటికి తప్పకుండా ఆ సినిమాపై రివ్యూ ఇస్తా. బాలీవుడ్​లో మూవీ ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తా. అదే నాకు ఓ మంచి అవకాశం అవుతుంది” అని ఆమె చెప్పారు.అనంతరం కిరీటాన్ని గెలుచుకోవడం కోసం మాట్లాడారు. “ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన రోజు.వ్యక్తిగతంగానే కాకుండా థాయ్‌లాండ్‌ ప్రజలకు కూడా ఇదొక మైలు రాయి అనే చెప్పాలి. నేనెంతో గర్వపడుతున్నా. మిస్‌ వరల్డ్‌ స్టేజ్‌(Miss World Stage)పై మా దేశానికి గుర్తింపు లభించింది. మా దేశానికి ఇదే తొలి విజయం. ఇలాంటి ఒక రోజు కోసం మేమంతా 70 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం. ఈ ప్రయాణం క్లిష్టమైనదని నేను చెప్పను. ఎందుకంటే, మన హృదయానికి చేరువైన దానిని పొందేందుకు వేసే ప్రతి అడుగుకు ఒక అర్థం ఉంటుంది” అని చెప్పారు.

Read Also: Asaduddin Owaisi: మరోసారి పాకిస్థాన్ విధానాలపై ఒవైసీ తీవ్ర విమర్శలు

#BollywoodFan #ManushiChhillar #MissWorld2025 #OpalSuchataChuwangsri #PriyankaChopra Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.