📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Nepal: రాచరిక పాలన కోసం నేపాల్‌లో కొనసాగుతున్న ఆందోళనలు

Author Icon By Vanipushpa
Updated: April 9, 2025 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌ పొరుగున్న ఉన్న హిమాలయ రాజ్యం నేపాల్‌ పురాతన దేవాలయాలు, పోరాట యోధులు, ఆకాశాన్ని తాకే శిఖరాలకు నిలయం. రాచరికాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యన్ని స్థాపించాక దేశం గాడిన పడుతుందని ఆ దేశ ప్రజలు భావించారు. అయితే ఏళ్ల తరబడి కొనసాగుతున్న రాజకీయ అస్థిరత, అవినీతి, అమలు కానీ హామీల కారణంగా హిమాలయ రాజ్యంలో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. రాచరికాన్ని తిరిగి పునరుద్ధరించడంతో పాటు హిందూ రాజ్యంగా ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
2008లో రాచరికం రద్దయి లౌకిక రాజ్యంగా ఏర్పడింది
నేపాల్ రాజకీయ ప్రయాణం నాటకీయంగా సాగింది. 1769 నుంచి 2008 వరకు దాదాపు 240 ఏళ్ల పాటు షా రాజవంశీయులు నేపాల్‌ను పాలించారు. రాజు సర్వోన్నత అధికారిగా ఉంటూనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నెలకొనాలని 1990లో ప్రజాందోళన ఉద్యమం నడిచింది. అందుకు అప్పటి రాజు బీరేంద్ర అంగీకరించారు. అయితే 2001లో జరిగిన సంఘటన నేపాల్‌లో రాచరికం పోవడానికి కారణమైంది. బీరేంద్ర కుమారుడు దీపేంద్ర తన తండ్రి, తల్లితో పాటు సోదరులు, సోదరిమణులను హతమార్చారు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నారు.

నిత్యం అధికార మార్పిడిలతో విసుగుచెందిన ప్రజలు
నేపాల్‌లో ప్రజాస్వామ్య స్థాపన జరిగినా అధికార మార్పిడి నిత్యకృత్యమయింది. దీంతో ప్రజల్లో ప్రస్తుతమున్న పార్టీలపై అసహనం మెుదలైంది. రాజకీయ అస్థిరత, అవినీతి, ఆర్థిక వెతలను నిరసిస్తూ రోడ్డెక్కారు. రాచరికాన్ని పునరుద్ధరించాలంటూ నినదించారు. ప్రజల ఆందోళనలకు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ సారథ్యం వహించింది. 2008 మే 28న నేపాల్‌లో రాచరికం రద్దయ్యాక 17 ఏళ్లలో 13 ప్రభుత్వాలు మారాయి.
కాఠ్‌మాండూలో హింసాత్మక ఘటన తర్వాత మాజీ రాజు జ్ఞానేంద్ర షా భద్రతను నేపాల్ ప్రభుత్వం కుదించింది. కాఠ్‌మాండ్‌లో ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిందుకు జ్ఞానేంద్ర షాకు ఆ నగర మున్సిపల్‌ అధికారులు 5వేల 900 డాలర్ల జరిమానా విధించారు.

READ ALSO: Donald Trump: చైనాకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్.. 104%కి పెంపు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in Nepal for monarchy Latest News in Telugu Ongoing protests Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.