📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Iran Israel War: ట్రంప్ హెచ్చరికతో చమురు ధరలకు రెక్కలు!

Author Icon By Vanipushpa
Updated: June 17, 2025 • 4:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం(Iran Israel War) రోజురోజుకూ ముదురుతోంది. యుద్దం మొదలై ఐదు రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్(Israel) కు తగులుతున్న దెబ్బలతో అమెరికాతో పాటు ఇతర మిత్రదేశాలూ పరోక్ష సాయం ప్రారంభించాయి. అదే సమయంలో ఇరాన్ కు మరింత ఎక్కువ అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్న ఇజ్రాయెల్ .. టెహ్రాన్(Tehran) పై భారీ దాడులకు ప్లాన్ చేసింది. దీన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) సైతం ధృవీకరించారు.

Iran Israel War: ట్రంప్ హెచ్చరికతో చమురు ధరలకు రెక్కలు!

ట్రంప్ హెచ్చరిక – టెహ్రాన్‌ను ఖాళీ చేయండి!
ఇరాన్ తమపై సంధిస్తున్న వరుస క్షిపణులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇజ్రాయెల్ అంతిమ యుద్దానికి సిద్దమవున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై వరుస దాడులు చేస్తూన్న ఇజ్రాయెల్ ఈ నగరంపై పట్టు సాధించినట్లు ప్రకటన కూడా చేసింది. ఈ నేపథ్యంలో పూర్తి స్ధాయిలో టెహ్రాన్ పై విరుచుకుపడేందుకు సిద్దమవుతోంది. ఇందుకోసం టెహ్రాన్ లో పౌరుల్ని నగరం విడిచి వెళ్లాలంటూ సూచనలు కూడా చేస్తోంది. అయితే ఇదే సూచన ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చేయడంతో టెహ్రాన్ లో భారీ ఉత్పాతం తప్పేలా లేదు.

చమురు ధరలపై యుద్ధం ప్రభావం
ట్రంప్ ప్రకటన ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో కొనసాగుతుండగా.. చమురు మార్కెట్లు సైతం పతనమవుతున్నాయి. దీంతో చమురు ధరల మంట ప్రారంభమైంది. ఇవాళ ఒక్క రోజే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ బ్రెంట్ ధర 2 శాతం పెరిగింది. ఈ ధర మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలకు అవసరమయ్యే చమురులో 6 శాతం సరఫరాకు వాడుతున్న హార్ముజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ చేస్తున్న హెచ్చరికల ప్రభావం కూడా చమురు ధరల మంటకు కారణమవుతోంది.
ప్రస్తుతానికి భారత్ వంటి దేశాల్లో చమురు నిల్వలు రెండు నెలకు పైగా ఉన్నాయి. కాబట్టి వెంటనే కలిగే నష్టమేదీ లేకపోయినా ఈ యుద్దం దీర్ఘకాలికంగా సాగితే మాత్రం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సమస్యలు తప్పేలా లేవు. అందుకే ఇరాన్-ఇజ్రాయెల్ ఇద్దరూ వెనక్కి తగ్గాలని ఐక్యరాజ్యసమితితో పాటు జీ7 దేశాల కూటమి కూడా కోరింది. ఇందుకోసం తెర వెనుక భారీ ఎత్తున మధ్యవర్తిత్వం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. హార్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు సరఫరాలో 6% జరుగుతోంది. ఇది మూసితే, ధరలు $100+ బ్యారెల్‌కి వెళ్తాయని నిపుణుల అంచనా.

Read Also: Military Aircraft : ఏ దేశం దగ్గర ఎన్ని మిలిటరీ ఎయిర్ క్రాఫ్టులున్నాయంటే?

#IranIsraelWar #telugu News #UNPeaceEfforts Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu oil prices Paper Telugu News soar with Trump's Telugu News online Telugu News Paper Telugu News Today Warning

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.