📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Trump: కాల్పుల విరమణ కాదు..చాలా పెద్దదే చేయబోతున్నా: ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: June 17, 2025 • 4:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌(Mecron) చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ – ఇజ్రాయెల్(Iran-Israel) మధ్య కాల్పుల విరమణ చేయించేందుకే కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సు నుంచి తాను ఆకస్మికంగా బయలుదేరానంటూ మెక్రాన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రచార ఆర్భాటం కోసమే మెక్రాన్ ఇలాంటి కామెంట్స్ చేశారని ట్రంప్ విమర్శించారు. తాను వాషింగ్టన్ డీసీకి చేరుకున్నాక ఇరాన్ – ఇజ్రాయెల్ కాల్పుల విరమణపై కసరత్తు చేస్తాననే మెక్రాన్ అంచనా తప్పు అని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. ‘నేను వాషింగ్టన్‌కే తిరిగి వెళ్తున్నాను. అయితే కాల్పుల విరమణ కోసమో, శాంతి ఒప్పందం కోసమో అస్సలు కాదు. దాని కంటే చాలా పెద్దదే చేయబోతున్నాను’ అని ట్రంప్ వెల్లడించారు. ‘మెక్రాన్ ఉద్దేశపూర్వకంగా అలా అన్నారో, సాధారణంగా అన్నారో నాకైతే తెలియదు కానీ అయితే ప్రతీసారి ఆయన తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు’ అని అమెరికా ప్రెసిడెంట్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ‘ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్స్’ పేజీలో డొనాల్డ్ ట్రంప్ ఈ పోస్ట్ పెట్టారు.

Trump: కాల్పుల విరమణ కాదు..చాలా పెద్దదే చేయబోతున్నా: ట్రంప్

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఏమన్నారు ?
‘ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణను
అమెరికా సాధిస్తే మేం సంతోషిస్తాం. ఈ ప్రయత్నంలో అమెరికాకు ఫ్రాన్స్ తప్పకుండా సాయం చేస్తుంది’ అని అమెరికాకు చెందిన సీఎన్ఎన్ మీడియా సంస్థకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తెలిపారు.
“ఇరాన్‌ చేతిలో అణ్వాయుధం ఉండకూడదు” – ట్రంప్
‘ట్రూత్ సోషల్’ వేదికగా సోమవారం మధ్యాహ్నం ట్రంప్ మరో కీలక పోస్ట్ పెట్టారు. ఇరాన్‌ను వదిలి వెళ్లిపోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్‌ చేతిలో అణ్వాయుధం ఉండకూడదన్నారు. తాను చెప్పిన విధంగా అణు ఒప్పందంపై ఈపాటికే ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా ఇరాన్ పాలకులు అణు డీల్‌కు ఓకే చెప్పకపోవడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు. ‘అమెరికా ఫస్ట్ అంటే చాలా గొప్ప విషయాల కలయిక. ఇరాన్‌కు అణ్వాయుధం లేకుండా చేయడం అనేది అందులో భాగం. అమెరికా గొప్పదని చాటి చెబుతాం’ అని మరో పోస్ట్‌లో ట్రంప్ వ్యాఖ్యానించారు. “ఇరాన్ పాలకులు ఇప్పటికే అణు ఒప్పందంపై సంతకం చేసుండాల్సింది. ప్రజల ప్రాణాలు పోతున్నా, వారు అణు డీల్ నుంచి తప్పుకొంటున్నారు.” “ఇరాన్ పాలకులు ఇప్పటికే అణు ఒప్పందంపై సంతకం చేసుండాల్సింది. ప్రజల ప్రాణాలు పోతున్నా, వారు అణు డీల్ నుంచి తప్పుకొంటు న్నారు.”అమెరికా గొప్పదనాన్ని మళ్లీ ప్రపంచానికి చాటిచెప్పతాం” అని పేర్కొన్నారు.

Read Also: Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంలో 125 మృతదేహాల గుర్తింపు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu but something Google News in Telugu Latest News in Telugu much bigger Not a ceasefire Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today trump

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.