ఎలాన్ మస్క్(Elon Musk) కు చెందిన మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్(Micro blanging sight X) మరోసారి పనిచేయకుండా పోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ మరోసారి ఎక్స్(X) మొరాయించడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ ట్వీట్ చూడాలన్నా, ఓ ట్వీట్(Twitter) చేయాలన్నా ఈ మధ్య కాలంలో వీఐపీలు సైతం ఎక్కువగా వాడుతున్న ఎక్స్ ఇవాళ పనిచేయకపోవడంతో వీరంతా ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పోస్టులు దర్శనమిస్తున్నాయి.
యూజర్లకు కష్టాలు తప్పడం లేదు
వాస్తవానికి రెండు రోజులుగా ఎక్స్ ఈ ఇబ్బందులు ఎదుర్కుంటూనే ఉంది. లాగిన్ అయ్యేందుకు యూజర్లు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్న ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో యూజర్లకు కష్టాలు తప్పడం లేదు. ఎక్స్ ట్రాకింగ్ సర్వీస్ అయిన డౌన్ ట్రాకర్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎక్స్ ను తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు నిపుణులు శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది.
చాలా మంది తమకు అసౌకర్యం
ఎక్స్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల్లో సైన్ ఇన్ కాకపోవడం, లైవ్ మెసేజ్ లు రాకపోవడం, పంపేందుకు వీల్లేకుండా బ్లాక్ అయిపోతుండటం వంటివి ఉన్నాయి. ఈ అంతరాయం డెస్క్‌టాప్ , మొబైల్ ఫోన్లలో సైతం కనిపిస్తోంది. దీంతో ఎక్స్ ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్న చాలా మంది తమకు అసౌకర్యం కలుగుతోందని ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే దీనిపై ఎక్స్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషం. దీంతో తిరిగి ఎక్స్ ఎప్పుడు ఓపెన్ అవుతోందనే ప్రశ్నలు ఇతర సోషల్ ప్లాట్ ఫామ్స్ పై వినిపిస్తున్నాయి.
Read Also: Pakistan :సైనిక వ్యాపార విస్తరణతో అగమ్యగోచరంగా భవిష్యత్తు