టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ ఉద్యోగులకు ఒక హెచ్చరిక జారీ చేసింది. ఏంటంటే వర్క్ ఫ్రొమ్ హోమ్ చేసే ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసుకి రావాలని, ఒకవేళ అలా చేయకపోతే వారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని పేర్కొంది. దీని బట్టి చూస్తే ఉద్యోగులు ఇక ఆఫీసుకి వచ్చి పని చేసేలా కఠినమైన నిర్ణయం కంపెనీ తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఉద్యోగులు వెంటనే వర్క్ ఫ్రొమ్ హోమ్ వదిలి వెంటనే ఆఫీసుకి రాకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని నొక్కి చెపింది.
అందరు ఆఫీస్ కు రావాల్సిందే
వర్క్ ఫ్రొమ్ హోమ్ చేసే వారు హైబ్రిడ్ మోడ్‌లో ఆఫీసుకి రావాలని, ప్రతి ఒక్కరూ కూడా ఆఫీస్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసుకు రావాలనే విధానాలను కఠినతరం చేయడంతో, గూగుల్ కూడా ఇప్పుడు ఉద్యోగులను ఆఫీసుకి రావాలని ఆహ్వానిస్తుంది. అలాగే నిర్దేశించిన రోజుల్లోపు ఆఫీస్ చేరుకోవాలని కూడా చెప్పింది.
ఉద్యోగులకు హైబ్రిడ్ మోడ్‌లో పని చేస్తున్నాయి
COVID-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిఒక్కరి జీవితంలో భయాందోళనలు, విషాదాలను కలిగించి దాదాపు 5 సంవత్సరాలు కావొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాల దేశాల్లో లాక్‌డౌన్, వివిధ రకాల ఆంక్షలు, కీలకమైన చర్యలలో ఒకటి WFH విధానానికి వెళ్లడం. ఈ విషయంలో వివిధ ప్రముఖ కంపెనీలు కూడా ఉద్యోగులను వర్క్ ఫ్రొమ్ హోమ్ చేయడానికి అనుమతించాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికీ ఉద్యోగులకు హైబ్రిడ్ మోడ్‌లో పనిచేసే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిల నుండి వివిధ కంపెనీలు వర్క్-ఫ్రమ్-హోమ్ విధానానికి పూర్తిగా స్వస్తి పలకగా, కొన్ని కంపెనీలలో మాత్రం ఇప్పటికీ వర్క్ ఫ్రొమ్ హోమ్ చేసే ఉద్యోగులు ఉన్నారు. ఇందుకు కారణం ఏమిటంటే కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ఎక్కువ శాతం ఉద్యోగులు ఆఫీసుకి తిరిగి రావడానికి ఆసక్తి చూపక పోవడం. ఎందుకంటే దీని వల్ల వారికి సమయం ఇంకా ఖర్చు కూడా ఆదా అవుతుంది. కానీ గూగుల్ ఫుల్ టైం యుఎస్ ఉద్యోగులలో కొంతమందికి 2025 ప్రారంభంలో వారి ఇష్టానుసారం ఆఫీసుకి వచ్చి పని చేసే అవకాశాన్ని ఇచ్చింది. దీని అర్థం ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకి రావచ్చు. అది కూడా వారికి ఒక అప్షన్ అని చెప్పవచ్చు.
భారీగా తొలగింపులు
మౌలిక సదుపాయాలు, టెక్నీకాల్ స్కిల్స్ అవసరమయ్యే AIలో భారీగా పెట్టుబడి పెట్టడానికి ఖర్చులను తగ్గించుకోవాలని Google అండ్ ఇతర టెక్ కంపెనీలు కూడా లక్ష్యం పెట్టుకోవడంతో ఈ చర్యలు తీసుకుంది. 2023 ప్రారంభంలో భారీగా తొలగింపులు జరిగిన తర్వాత గూగుల్ కూడా ఉద్యోగ కోతలను విధించింది. ఇవన్నీ కూడా AIలో ఎక్కువ పెట్టుబడికి ఒక సన్నాహాలు. ఫిబ్రవరిలో గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ మాట్లాడుతూ, ఉత్పాదకత పెంచడానికి AI ఉద్యోగులు ప్రతిరోజూ ఆఫీసులో ఉండాలని అలాగే వారానికి 60 గంటలు పని చేయాలని చెప్పానని అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న AI పరిశ్రమలో పోటీ కొనసాగించడానికి ఉద్యోగులు ప్రయత్నాలను మరింతగా పెంచాలని కూడా ఆయన కోరారు.
Read Also: Pahalgam Terror Attack : పహల్గాం దాడి.. ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత