📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Nick Knight: గిల్‌ను ఇంగ్లండ్ లక్ష్యంగా చేసుకుంటుందన్న నిక్ నైట్

Author Icon By Anusha
Updated: June 18, 2025 • 3:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డబ్ల్యూటీసీ కొత్త సైకిల్‌లో తొలి సిరీస్‌కోసం భారత జట్టు (Team India) పక్కాగా సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌తో జూన్ 20న జరుగబోయే తొలి టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సేన. ఇప్పటికే ఆటగాళ్లంతా ఇంగ్లండ్‌ చేరుకున్నారు. సిరీస్ ఆరంభానికి సమయం దగ్గరపడుతుండటంతో జట్టు ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఈ నేపథ్యంలో,కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటుందని ఆ జట్టు మాజీ ఆటగాడు నిక్ నైట్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గానూ, ప్రధాన బ్యాటర్‌గానూ గిల్ ఎలా రాణిస్తాడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న తరుణంలో నిక్ నైట్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ప్రతి జట్టుకూ ప్రత్యర్థి కెప్టెన్‌ను ఒత్తిడిలోకి నెట్టడం చాలా ముఖ్యం. ఇంగ్లండ్ కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తుందని నేను భావిస్తున్నాను.

గిల్ అద్భుతంగా

కెప్టెన్ కనుక కాస్త ఇబ్బంది పడితే, ఆ ప్రభావం సహజంగానే డ్రెస్సింగ్ రూమ్‌పై పడుతుంది. అందుకే, శుభ్‌మన్‌ గిల్‌ను టార్గెట్ చేసి, అతడిని వీలైనంత త్వరగా పెవిలియన్‌కు పంపాలని, తద్వారా అతడిని అసౌకర్యానికి గురిచేయాలని ఇంగ్లండ్ జట్టు (England team) ప్రయత్నిస్తుంది” అని నిక్ నైట్ పేర్కొన్నాడు. స్వదేశంలో గిల్ అద్భుతంగా రాణించినప్పటికీ, విదేశీ గడ్డపై అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. విదేశాల్లో ఇప్పటివరకు ఆడిన 15 టెస్టు మ్యాచ్‌లలో గిల్ 27.53 సగటుతో 716 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక సెంచరీ ఉంది. అదే సొంత‌ గడ్డపై ఆడిన 17 మ్యాచ్‌లలో 42 సగటుతో 1,177 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శ‌త‌కాలు ఉన్నాయి. ఈ గణాంకాల నేపథ్యంలోనే ఇంగ్లండ్ జట్టు గిల్‌ను లక్ష్యంగా చేసుకోవచ్చని నైట్ అంచనా వేశాడు.అయితే, గిల్ ప్రతిభను కొనియాడుతూ “శుభ్‌మన్‌కు ఇది చాలా పెద్ద సిరీస్ కాబోతోంది.

Nick Knight: గిల్‌ను ఇంగ్లండ్ లక్ష్యంగా చేసుకుంటుందన్న నిక్ నైట్

అతడిని ఇబ్బంది

నేను అతనికి పెద్ద అభిమానిని. అండర్-19 ప్రపంచ కప్ ఆడుతున్నప్పటి నుంచే అతని ఆటను గమనిస్తున్నాను.అప్పట్లోనే తను అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ఆటగాడు అవుతాడని నేను ఊహించాను” అని నిక్ నైట్ (Nick Knight) ప్రశంసించాడు. అదే సమయంలో గిల్ తన బ్యాటింగ్ టెక్నిక్‌ను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లు ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించి అతడిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయ‌ప‌డ్డాడు.కాగా, భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ (Test series) ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. సిరీస్‌లోని తొలి టెస్టు మ్యాచ్ లీడ్స్ మైదానం వేదికగా జరగనుంది. ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో ఈ రెండు అగ్రశ్రేణి జట్లకు ఇదే మొదటి సిరీస్ కావడం విశేషం.

Read Also: Sophie Devine: వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సోఫీ డెవిన్‌

#INDvsENG #NickKnight #ShubmanGill #TestCricket Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.