📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Nicholas Pooran: నికోలస్ హఠాత్తు రిటైర్మెంట్‌కు గల కారణాలు ఏంటి?

Author Icon By Anusha
Updated: June 11, 2025 • 10:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు,వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్(Nicholas Pooran)29 ఏళ్ల వయసులోనే దేశం తరఫున ఆడలేనని ప్రకటించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారు పేరు అయిన నికోలస్ పూరన్ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని, తనపై ప్రేమను చూపించిన అభిమానులకు కృతజ్ఞతలు అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నికోలస్ పూరన్ ఓ సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నాడు.

సాయశక్తులా కృషి

డియర్ ఫ్యాన్స్ చాలా ఆలోచనలు, పరిశీలనల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. ఈ ఆట నాకెంతో ఇచ్చింది.ఈ ప్రయాణంలో ఎంతో ఆనందం, ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. వెస్టిండీస్‌కు ప్రాతినిథ్యం వహించడాన్ని గర్వంగా భావిస్తున్నా. మెరూన్ జెర్సీ(Maroon jersey)ని ధరించడం, మైదానంలో నిలబడి జాతీయ గీతం ఆలపించడం, జట్టు కోసం సాయశక్తులా కృషి చేయడం, ఇవన్ని నాకు ఎంత ముఖ్యమో మాటల్లో చెప్పలేను. వెస్టిండీస్ జట్టుకు సారథ్యం వహించడం ఎప్పటికీ మరిచిపోలేను.

నమ్మకం

అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తాను. నాపై ప్రేమను చూపించిన అభిమానులకు కృతజ్ఞతలు. కష్ట సమయాల్లో అండగా నిలిచారు. నా సక్సెస్‌ను సెలెబ్రేట్ చేసుకున్నారు. నా కుటుంబం, స్నేహితులు, నా సతీమణితో పాటు నా ఈ ప్రయాణంలో నాతో నడిచిన మీకు ధన్యవాదాలు. మీ మద్దతు, నమ్మకం నన్ను నిలబెట్టాయి. నా కెరీర్‌లో అంతర్జాతీయ అధ్యాయం ముగిసినప్పటికీ వెస్టిండీస్ క్రికెట్‌పై నాకున్న ప్రేమ ఎప్పటికీ చెక్కు చెదరదు. వెస్టిండీస్ జట్టు మరింత బలంగా మారడంతో పాటు అద్భుతమై విజయాలు అందుకోవాలని కోరుకుంటా.’అని నికోలస్ పూరన్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

ఫ్రాంచైజీ క్రికెట్‌

అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణించ లేకపోవడం, బిజీ షెడ్యూల్, ఇతర కమిట్‌మెంట్ల కారణంగా నికోలస్ పూరన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చాలా మంది ఆటగాళ్లు జాతీయ జట్టు(National team) తరఫున ఆడటం కంటే ఫ్రాంచైజీ క్రికెట్‌ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. పూరన్ కూడా ఇదే బాటలో నడిచినట్లు అర్థమవుతోంది.

సుదీర్ఘ కాలం

ఇతర వ్యక్తిగత కారణాలు కూడా అతని రిటైర్మెంట్ నిర్ణయంపై ప్రభావం చూపి ఉండవచ్చనే అభిప్రాయం కలుగుతోంది. ముఖ్యంగా ఫ్రాంచైజీ క్రికెట్‌(Franchise cricket)తో తీరికలేని క్రికెట్ ఆడుతుండటంతో ఫ్యామిలీకి సమయం కేటాయించలేకపోతున్నాననే బాధ పూరన్‌ను వెంటాడినట్లు తెలుస్తోంది. మరింత ఫిట్‌గా ఉండటంతో పాటు సుదీర్ఘ కాలం ఫ్రాంచైజీ క్రికెట్ ఆడాలనే లక్ష్యంతో పూరన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది. ఏది ఏమైనా నికోలస్ పూరన్ ఆకస్మిక నిర్ణయం వెస్టిండీస్ క్రికెట్‌కు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు.

Read Also: RCB: ఆర్సీబీ ఘటనలో గవర్నర్‌,సీఎంల మధ్య ముదురుతున్న వివాదం

#CricketRetirement #FranchiseCricket #NicholasPooran #PooranStepsDown #WestIndiesCricket Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.