📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan Army Chief: పాక్ ఆర్మీ చీఫ్​ కి ప్రమోషన్ పై నెటిజన్ల ట్రోలింగ్

Author Icon By Vanipushpa
Updated: May 22, 2025 • 12:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కారణమేమిటో తెలియదు కానీ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్(Pakistan Army Chief) ఆసిమ్ మునీర్‌(Asim Munir) కు ప్రధానమంత్రి(Prime Minister) షెహబాజ్ షరీఫ్ ప్రమోషన్(Shahbaz Sharif) ఇచ్చారు. ఆయనకు ఫైవ్ స్టార్స్ కలిగిన పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ హోదాను కట్టబెట్టారు. దీనిపై పాక్ ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆ దేశ ఆర్మీ చరిత్రలో అయ్యుబ్ ఖాన్ తర్వాత ఫీల్డ్ మార్షల్ హోదాను పొందిన రెండో సైనిక అధికారిగా ఆసిమ్ మునీర్ నిలిచారు.

Pakistan Army Chief: పాక్ ఆర్మీ చీఫ్​ కి ప్రమోషన్ పై నెటిజన్ల ట్రోలింగ్

ఆసిమ్ మునీర్‌కు పదోన్నతి ఎందుకిచ్చారు ?
ఈ ప్రమోషన్‌ వ్యవహారంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆసిమ్ మునీర్‌కు పదోన్నతి ఎందుకిచ్చారు ? అంతగా ఏం చేశాడు ? అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ‘భారత సేనల దాడిలో పాకిస్తాన్‌కు చావుతప్పి కన్నులొట్ట పోయింది. అలాంటప్పుడు ఆసిమ్ మునీర్‌కు ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అని పలువురు నెటిజన్లు పాక్ సర్కారును నిలదీశారు. ‘‘భారత సేనల ఎదుట పాక్ నిలువలేకపోయింది. అదే నిజం. చిత్తుగా ఓడిపోయినందుకే ఆసిమ్ మునీర్‌కు ఈ ప్రమోషన్ ఇచ్చారా ?’’ అని కొందరు నెటిజన్లు పాక్​కు ఎత్తిపొడుపు ప్రశ్నను ఎక్కుపెట్టారు.

ఉగ్రవాద నిలయం పాకిస్థాన్: కేకే సిన్హా
ఈ అంశంపై భారత ఆర్మీ రిటైర్డ్ అధికారి మేజర్ జనరల్ కేకే సిన్హా కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘”ఉగ్రవాద నిలయం పాకిస్థాన్. ఫెయిలైన దేశం అది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో ఓడిపోవడంతో నవ్వుల పాలైంది. ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి కల్పించడం ద్వారా మరోసారి పాక్ యావత్ ప్రపంచంలో అపహాస్యం పాలైంది. ఎంతో వ్యంగ్యంగా ఉంది కదూ” అని కేకే సిన్హా వ్యాఖ్యానించారు. “అయ్యుబ్ ఖాన్ తర్వాత పాకిస్థాన్​లో ఫీల్డ్ మార్షల్ హోదా పొందిన రెండో వ్యక్తి ఆసిమ్ మునీర్. అయ్యుబ్ ఖాన్ 1957లో మార్షల్ లా విధించాడు. ఆ వెంటనే 1958లో అతడు తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఆ మరుసటి సంవత్సరమే (1959లో) అయ్యుబ్ ఖాన్ తనకు తానుగా ఫీల్డ్ మార్షల్ హోదాను ఇచ్చుకున్నాడు. చివరకు 1965లో భారత్‌తో జరిగిన యుద్ధంలో ఓడిపోయాడు. పాక్ నాశనానికి కారకులు అవుతున్న ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజార్‌లకు కూడా పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ హోదాను ఇచ్చుకోవాలి” అని కేకే సిన్హా ఎద్దేవా చేశారు.

భ్రమల్లో తేలుతున్న పాక్ సర్కారు
కొందరు నెటిజన్లు ఆసిమ్ మునీర్‌ను ది డిక్టేటర్ మూవీలోని కల్పిత పాత్ర అల్లాదీన్‌తో పోల్చారు. “అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, ఫీల్డ్ మార్షల్, అడ్మిరల్, ఎయిర్ మార్షల్ ఆగా ఆసిమ్ మునీర్‌ను కలవండి. ఫీల్డ్ మార్షల్ అల్లాదీన్ మాదిరిగానే వెళ్తున్నాడు. ఇది ఫేక్ న్యూస్ కావాలని నేను ఆశిస్తున్నాను” అని సదరు నెటిజన్ రాసుకొచ్చాడు. పాక్ సర్కారు భ్రమల్లో తేలుతూ మునీర్ లాంటి వాళ్లకు ప్రమోషన్లు ఇస్తోందని ఇంకొందరు మండిపడ్డారు.

https://twitter.com/1no_aalsi_/status/1924822592986435950

బంకర్‌లో దాక్కున్నందుకే ప్రమోషన్ ఇచ్చి ఉంటారు!
భారత సైన్యం దాడులు చేస్తున్న సమయంలో ఆసిమ్ మునీర్ రహస్య బంకర్‌లో దాక్కున్న విషయాన్ని ఓ నెటిజన్ గుర్తు చేశాడు. “భారత్‌కు భయపడి బంకర్‌లో దాక్కున్నందుకే ఆసిమ్ మునీర్‌కు ప్రమోషన్ ఇచ్చి ఉంటారు. భారత్ చేతిలో పాకిస్తాన్‌ను ఓడించినందుకు అతడిని గుర్తించి ఉంటారు. ఈవిధంగా బంకర్‌లో దాక్కున్న తర్వాత బ్యాడ్జ్ పొందిన ఏకైక వ్యక్తి ఇతడే. బంకర్లు మాట్లాడగలిగితే, అవి కూడా పతకాలు అడుగుతాయి” అని సదరు నెటిజన్ వ్యాఖ్యలు చేశాడు.

Read Also: Centre On Waqf Act: సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్ట సవరణలపై విచారణ

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Netizens troll over promotion Pakistan Army Chief Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.