📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Netanyahu: రెండోసారి నెతన్యాహు కుమారుడి పెళ్లి వాయిదా.. రాజకీయ దుమారం

Author Icon By Vanipushpa
Updated: June 20, 2025 • 1:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్(Israel) ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Netanyahu) వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వ్యాఖ్య ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌(Iran)తో జరుగుతున్న యుద్ధం కారణంగా తన కుమారుడి వివాహం రెండోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని అధికారికంగా చెబుతూనే.. నెతన్యాహు దీన్ని తాను యుద్ధం కోసం చేస్తున్న వ్యక్తిగత త్యాగంగా అభివర్ణించారు. పెళ్లి ఆగిరపోవడంతో తన భార్య, కాబోయే కోడులు తీవ్ర మనస్తాపం చెందుతున్నారని, వారు నిజంగా హీరోలంటూ అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణం అవుతున్నాయి. ముఖ్యంగా ప్రజల నుంచి సైతం తీవ్ర విమర్శల వస్తున్నాయి. యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన వేలాదిమంది పౌరులు, సైనికుల కుటుంబాల బాధతో పోలిస్తే.. పెళ్లి వాయిదా పడడం పెద్ద విషయమేమీ కాదని, దీనికే దేశం కోం తామేదో పెద్ద త్యాగం చేస్తున్నట్లుగా చెప్పాల్సిన అవసరం లేదని విపక్షాలు, ప్రజలు మండిపడుతున్నారు.

Netanyahu: రెండోసారి నెతన్యాహు కుమారుడి పెళ్లి వాయిదా.. రాజకీయ దుమారం

ఇజ్రాయెలీ సైనికుల ప్రాణాలు త్యాగం
ఇజ్రాయెల్-ఇరాన్(Israel-Iran) మధ్య గత కొన్ని నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అవి కాస్తా ఇప్పుడు పరాకాష్ఠకు చేరాయి. సరిహద్దుల్లో నిత్యం కాల్పుల విరమణ ఉల్లంఘనలు, వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఈ యుద్ధ వాతావరణంలో అనేక మంది ఇజ్రాయెలీ సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వేలాది మంది పౌరులు తమ ఇళ్లను, ఆస్తులను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో.. ఆదేశ ప్రధాని బెంజిమెన్(Benjimen Netanyahu) నెతన్యాహు తన కుమారుడి వివాహం వాయిదా పడటాన్ని ‘త్యాగంగా’ అభివర్ణించారు. ఇది కాస్తా వివాదానికి దారితీసింది.
సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత
ముఖ్యంగా నెతన్యాహు కుమారుడు అవ్నెర్ వివాహం మొదట ఇరాన్-ఇజ్రాయెల్(Israel-Iran) మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి యుద్ధ పరిస్థితులు కొనసాగుతుండటంతో రెండోసారి కూడా వాయిదా పడినట్లు నెతన్యాహు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా ప్రస్తావించి.. దానిని యుద్ధం కోసం తన కుటుంబం చేస్తున్న వ్యక్తిగత త్యాగంగా పేర్కొన్నారు. పెళ్లి వాయిదా పడడంతో.. ముఖ్యంగా తన భార్య, కాబోయే కోడలు విపరీతంగా బాధ పడుతున్నారని అన్నారు. వాళ్లే నిజమైన హీరోలని.. దేశం కోసం వాళ్లు కూడా వాయిదాకు అంగీకరించారని చెప్పారు. అయితే నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేయగానే.. సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

Read Also: Egypt :భారత్‌కు సాయం చేస్తున్న ఈజిప్టు దేశం..!

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Netanyahu's Paper Telugu News political turmoil postponed for the second time son's wedding Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.