ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) అమెరికాలోని న్యూయార్క్‌ను సందర్శించాలనే తన ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేశారు. అయితే ఆయనపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) గతంలో జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ఆధారంగా.. నెతన్యాహు న్యూయార్క్‌కు వస్తే అరెస్టు చేయిస్తానని కొత్తగా ఎన్నికైన న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ హెచ్చరికలు చేశారు. ఈ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని నెతన్యాహు.. తన పర్యటనపై ధీమా వ్యక్తం చేశారు. ఓ మీడియా ఛానెల్‌కు వర్చువల్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు మాట్లాడుతూ.. “అవును. నేను న్యూయార్క్‌ను సందర్శించాలనుకుంటున్నా” అని పేర్కొన్నారు.
Read Also: Aasim-Imran: ఆసిమ్ మునీర్ కు పిచ్చెక్కింది..ఇమ్రాన్ ఖాన్

నెతన్యాహుపై మమ్దానీ విమర్శలు
ఈ సందర్భంగా మమ్దానీతో మాట్లాడతారా అని అడిగిన ప్రశ్నకు నెతన్యాహు స్పందిస్తూ.. “మమ్దానీ తన మనసు మార్చుకోవాలి. మనకు జీవించే హక్కు ఉందని అతడు చెబితే, మా మధ్య సంభాషణకు అది మంచి ఆరంభం అవుతుంది” అని వ్యాఖ్యానించారు. డెమోక్రటిక్ సోషలిస్టు అయిన మమ్దానీ ఇటీవల న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో విజయంసాధించారు. తన ఎన్నికల ప్రచారం సందర్భంగా నెతన్యాహుపై మమ్దానీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయనను బహిరంగంగానే యుద్ధ నేరస్థుడిగా అభివర్ణించారు.
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ
ఒకవేళ తాను మేయర్ అయితే.. బెంజిమిన్ నెతన్యాహు న్యూయార్క్‌కు వస్తే మాత్రం కచ్చితంగా ఆయన్ను అరెస్టు చేయిస్తానని మమ్దానీ బహిరంగంగా హెచ్చరించారు. గాజాపై యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌తో పాటు నెతన్యాహుపై 2024లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఐసీసీ సభ్య దేశాలు ఈ వారెంట్‌ను గౌరవించాల్సి ఉంటుంది. అమెరికా ఐసీసీలో సభ్య దేశం కానప్పటికీ.. అంతర్జాతీయ చట్టాల పట్ల కొంతమంది రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే మమ్దానీ కూడా అరెస్ట్ చేస్తామంటూ ప్రకటించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: