హమాస్ పై ఏడాదిన్నరగా సాగిస్తున్న ఇశ్రాయెల్ యుద్ధంతో గాజా పట్టణమంతా బూడిదిబ్బగా మారింది. నిత్యం ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిపోతున్నారు. గాజాలోని ప్రజల పరిస్థితి కడుదయనీయంగా మారేందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ చేస్తున్న యుద్ధమే కారణమని ప్రపంచం గగ్గోలు పెడుతున్నా ఆయన ఏమాత్రం చలించడం లేదు. హమాస్ ను అంతం ఆయిన తర్వాతే యుద్ధాన్ని విరమిస్తానని ఆయన అన్నారు. దీంతో నెతన్యాహూ యుద్ధనేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల నెతన్యాహూ అమెరికాకు వెళ్లేందుకు ఎంచుకున్న మార్గంపై పెద్ద చర్చ జరుగుతోంది. తన పేరిట అరెస్టు వారెంట్ జారీ(Arrest warrant issued) కావడంతో ఆయన అమెరికా వెళ్లేందుకు కొత్తమార్గం ఎంచుకున్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఇటీవల ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్ ప్రధాని తన అధికారిక వింగ్స్ ఆఫ్ జయాన్ విమానంలో వెళ్లారు. అయితే ఈ ప్రయాణం ఐరోపా దేశాల గగనతలం మీదుగా కాకుండా మధ్యధర సముద్రం మీదుగా ప్రయాణించారు.
USA: పాక్ ప్రధాని, ఆర్మీచీఫ్ తో ట్రంప్ ప్రత్యేక భేటీ
కొత్త మార్గం ఎంపికకు కారణం?
సాధారణంగా ఇజ్రాయెలీ విమానాలు ఐరోపా దేశాల మీదుగా వెళతాయి. అమెరికాకు వెళ్లేందుకు ఇది సులవైన మార్గం. కానీ ఇజ్రాయెల్ ప్రధాని విమానం ఇందుకు భిన్నమైన మార్గంలో ప్రయాణించడం ఆసక్తి రూపుతోంది. కొత్త మార్గం కారణంగా ఇజ్రాయెల్ ప్రధాని అదనంగా 373 మైళ్లు ప్రయాణించాల్సి వచ్చిందని పరిశీలకులు చెబుతున్నారు. గాజాలో యుద్ధ నేరాల అభియోగాలు ఎదుర్కొంటున్న బెంజమెన్ నెతన్యాహూపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(International Criminal Court) (ఐసీసీ) గతేడాది నవంబరులో అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అనవసర చిక్కులు వద్దన్న ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ ప్రధాని ఐరోపా దేశాల గగనతలమీదుగా ప్రయాణించలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఐసీసీలో సభ్యత్వం ఉన్న పలు ఐరోపా దేశాలు ఇప్పటికే బెంజమిన్ నెతన్యాహుపై గుర్రుగా ఉన్నాయి. తమ దేశంలో కాలుఎపెడితే ఆయనను అదుపులోకి తీసుకుంటామని పలు దేశాలు ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాయి.
బెంజమిన్ నెతన్యాహూపై ఎందుకు అరెస్టు వారెంట్ జారీ అయ్యింది?
గాజాలో హమాస్‌పై యుద్ధంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలు, యుద్ధనేరాల ఆరోపణల కారణంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ICC) అరెస్టు వారెంట్ జారీ చేసింది.
నెతన్యాహూ అమెరికాకు వెళ్లేందుకు ఎందుకు కొత్త మార్గం ఎంచుకున్నారు?
ఐరోపా దేశాల గగనతలంపై ప్రయాణిస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశముందని భయపడి, మధ్యధర సముద్రం మీదుగా పొడవైన మార్గం ఎంచుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: