గాజా శాంతి ప్రణాళిక ఒప్పందం లో మొదటి దశకు ఇజ్రాయెల్, హమాస్(Israel, Hamas) లు అంగీకరించాయి. దీనికి సంబంధించి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా హమాస్ తన దగ్గర ఉన్న బందీలను విడిచి పెడుతుంది. ఇజ్రాయెల్ గాజా నుంచి తన దళాలను ఉపసంహరించుకుం టుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటించారు. గాజా శాంతి ఒప్పందంలో మొదటి దశకు ఇజ్రాయెల్, హమాస్ లు అంగీకరించినందుకు గర్వంగా ఉంది అటూ ట్రంప్ పోస్ట్ లో రాశారు. అన్ని వర్గాలను సమానంగా చూస్తామని…అరబ్, ముస్లిం, ఇజ్రాయెల్, ఇతర చుట్టు పక్కల దేశాలకు, అమెరికాకు ఇది ఎంతో గొప్ప రోజని చెప్పారు. ఈ మొత్తం జరగడానికి మాతో పాటూ కలిసి పని చేసిన ఖతార్, ఈజిప్ట్, టర్కీలకు ధన్యవాదాలు అంటూ ట్రంప్ పోస్ట్ లో పెట్టారు.
Nvidia CEO: విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా సీఈఓ
ఫోన్ లో ట్రంప్ తో తన భావోద్వేగాన్ని పంచుకున్న నెతన్యాహు
అనంతరం దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా స్పందించారు. ఈ ఒప్పందం ఇ్రజ్రాయెల్ నైతిక, దౌత్యపరమైన విజయమంటూ ఎక్స్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. గాజాలో హమాస్ నిర్బంధించిన వారందరినీ ఇజ్రాయెల్ స్వదేశానికి తీసుకువస్తుందని అన్నారు. తాను మొదటి నుంచి చెప్పినట్లే చేశామని…బందీలను వెనక్కు తీసుకొచ్చే వరకు, తమ లక్ష్యాలను సాధించే వరకు విశ్రమించము అని..అన్నట్టే చేశామని నెతన్యాహు చెప్పారు. ఇజ్రాయెల్ ధృడ సంకల్నం, శక్తివంతమైన సైనిక చర్యలు…అమెరికా అధ్యక్షుడి ట్రంప్ గొప్ప ప్రయత్నాల వల్లనే ఇదంతా సాధ్యమైందని పోస్ట్ లో ఉటంకించారు. ప్రస్తుతం జరిగినది చాలా కీలకమైన మలుపని అన్నారు. ఈ విషయంలో ట్రంప్ కు తాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని నెతన్యాహు రాశారు. దేవుడు అమెరికాను, ఇజ్రాయెల్ ను ఎప్పటికీ ఆశీర్వదిస్తాడని అన్నారు.
ఒకరినొకరు అభినందించుకున్న ట్రంప్ , నెతన్యాహు
నెతన్యాహు తన ఉద్వేగాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కూడా పంచుకున్నారని తెలుస్తోంది. నెతన్యాహు ఫోన్ కాల్ చేశారని ప్రీమియర్ కార్యాలయం తెలిపింది. దాంతో పాటూ తమ పార్లమెంటులో మాట్లాడడానికి ఆయన ట్రంప్ ను ఆహ్వానించారని చెప్పింది. బందీలందరినీ విడుదల చేయడానికి ఒప్పందంపై సంతకం చేయడంలో చారిత్రాత్మక విజయం సాధించినందుకు ఇద్దరూ ఒకరినొకరు అభినందించుకుంటూ, చాలా భావోద్వేగ, హృదయపూర్వక సంభాషణ చేశారని.. నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ట్రంప్ కృషి, ప్రపంచ నాయకత్వాన్ని నెతన్యాహు..ప్రధాని దృఢమైన నాయకత్వం, ఆయన తీసుకున్న చర్యలను ట్రంప్ ప్రశంసించుకున్నారని చెప్పింది.
హమాస్ ఇజ్రాయెల్‌లో ఉందా?
HAMAS బలం గాజా స్ట్రిప్ మరియు వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. HAMAS ఇజ్ అల్-దిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ అని పిలువబడే సైనిక విభాగాన్ని కలిగి ఉంది, ఇది 1990ల నుండి ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా భూభాగాలు రెండింటిలోనూ అనేక ఇజ్రాయెల్ వ్యతిరేక దాడులను నిర్వహించింది.
ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ఎందుకు పోరాడుతున్నాయి?
పాలస్తీనియన్లు చారిత్రాత్మక పాలస్తీనాలోని కనీసం ఒక ప్రాంతంలోనైనా తమ స్వంత స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాలని ప్రయత్నిస్తున్నారు. ఇజ్రాయెల్ తన సొంత సరిహద్దుల రక్షణ, వెస్ట్ బ్యాంక్ పై నియంత్రణ, గాజా స్ట్రిప్ పై ఈజిప్టు-ఇజ్రాయెల్ దిగ్బంధనం మరియు పాలస్తీనా అంతర్గత రాజకీయాలు ప్రస్తుతం పాలస్తీనియన్ల లక్ష్యాన్ని చేరుకోలేకుండా చేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: