భారత రక్షణ వ్యవస్థ(Indian Defence Department)లో ఓ భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది. దేశ రక్షణ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పాకిస్తాన్(Pakistan)కు గూఢాచర్యం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై రాజస్థాన్ ఇంటెలిజెన్స్ బృందం(Rajastan intelligence group) పెద్ద ఎత్తున దర్యాప్తు చేపట్టింది.
అరెస్టైన నేవీ ఉద్యోగి: విశాల్ యాదవ్(Vishal Yadav)
నిందితుడు: విశాల్ యాదవ్, హర్యానాలోని రేవారి జిల్లాలోని పున్సిక ప్రాంత నివాసి.
ఉద్యోగం: నావల్ హెడ్ క్వార్టర్స్‌లో అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC)
ప్రస్తుతం డైరెక్టరేట్ ఆఫ్ డాక్‌యార్డ్‌లో పని చేస్తున్నాడు.
1923 అధికారిక రహస్యాల చట్టం కింద రాజస్థాన్ ఇంటెలిజెన్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
పాక్‌కు లీక్ చేసిన రహస్య సమాచారం
సోషల్ మీడియా ద్వారా పాకిస్తానీ మహిళా హ్యాండ్లర్‌కు సమాచారం లీక్ చేశాడు.
ఆమెతో ప్రియా శర్మ అనే ఫేక్ అకౌంట్ ద్వారా చాటింగ్ చేశాడు.
ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన సున్నితమైన నావికాదళ నిఘా సమాచారంను షేర్ చేశాడు.
ఫోరెన్సిక్ విశ్లేషణలో చాట్ రికార్డులు, డాక్యుమెంట్లు లభించాయి.
ఆర్థిక ప్రలోభాల కారణంగా గూఢచర్యం
విశాల్ యాదవ్ ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిస అయ్యాడు.
ఆర్థికంగా కష్టాల్లో ఉన్నందున: క్రిప్టో కరెన్సీ, బ్యాంక్ మార్గంలో డబ్బులు తీసుకున్నాడు.
రహస్య సమాచారం పంచుకుని పాక్ ISI సంస్థకు గూఢచారిగా మారాడు. విశాల్ యాదవ్ డైరెక్టరేట్ ఆఫ్ డాక్‌యార్డ్‌లో పనిచేస్తున్నాడు. ప్రియా శర్మ అనే ఫేక్ అకౌంట్‌లో పాకిస్తానీ మహిళా హ్యాండ్లర్‌తో సోషల్ మీడియాలో ఇన్‌ఫర్మేషన్ లీక్ చేశాడు.
నేవీ వంటి కీలక విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి ఇలా సమాచారం లీక్ చేయడం భద్రతా యంత్రాంగానికి గట్టి హెచ్చరిక. కేంద్ర ఇంటెలిజెన్స్‌తో పాటు నావల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.
Read Also: Iran-Israel war : ఇరాన్ నుంచి మరో 296 మంది భారతీయుల తరలింపు