📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

NATO Defence: రష్యాతో అమీతుమీకి నాటో దేశాల సన్నాహాలు

Author Icon By Vanipushpa
Updated: June 28, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్రరాజ్యాల మధ్య మరోసారి కోల్డ్ వార్(Cold War) మొదలైందా? అమెరికా సారథ్యంలోని నాటో కూటమి, వ్లాదిమిర్ పుతిన్ సారథ్యంలోని రష్యా ఢీ అంటే ఢీ అంటున్నాయా? ఇటీవలే (జూన్ 24, 25) నెదర్లాండ్స్‌లో జరిగిన నాటో(Nato) కూటమి సదస్సులో తీసుకున్న సంచలన నిర్ణయాలను చూస్తుంటే మరోసారి కోల్డ్ వార్ జరగనుందనే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌(Ukraine) విషయంలో రాజీలేకుండా రష్యా(Russia) ముందుకు సాగుతుండటాన్ని చూసి ఆందోళన చెందుతున్న నాటో దేశాలు, ఇక నుంచి తమ జీడీపీలో 5 శాతాన్ని రక్షణ వ్యయాలకు కేటాయిస్తామని ప్రకటించాయి. రష్యాను ఎదుర్కొనేందుకు సైనిక శక్తి నుంచి సైబర్ శక్తి దాకా అన్నీ బలోపేతం చేస్తామని నాటో తీర్మానించింది. ఇంతకీ రాబోయే కొన్నేళ్లలో ఏం జరగబోతోంది? రష్యా విషయంలో నాటో కూటమి వ్యూహమేంటి?

NATO Defence: రష్యాతో అమీతుమీకి నాటో దేశాల సన్నాహాలు

అమెరికా కనుసన్నల్లో పనిచేయసాగాయి
కోల్డ్‌వార్ కంటే ముందు మనం రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి కీలక పరిణామాల గురించి తెలుసుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబులు వేసింది. దీని తర్వాత అంతర్జాతీయ స్థాయి కలిగిన సామాజిక, ఆర్థిక సంస్థలు అమెరికా కనుసన్నల్లో పనిచేయసాగాయి. కొన్ని దేశాలను ఆర్థిక సాయంతో, ఇంకొన్ని దేశాలను సైనిక సాయంతో, మరికొన్ని దేశాలను అంతర్జాతీయ సంస్థల ద్వారా తన పక్షాన ఉండేలా అమెరికా మార్చుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ (అవిభక్త రష్యా) అనేది అమెరికాకు పెద్ద సవాల్‌గా కనిపించింది. దాన్ని ఎదుర్కొనేందుకు పశ్చిమ ఐరోపా దేశాలను చేరదీసి, వాటికి అమెరికా పెద్దఎత్తున సైనిక సాయాన్ని అందించింది.

అప్రమత్తమైన సోవియట్ యూనియన్
ఈ పరిణామాలను గుర్తించి అప్రమత్తమైన సోవియట్ యూనియన్ తన మిత్రదేశాల సంఖ్యను పెంచుకోసాగింది. నాటోకు వ్యతిరేకంగా తన మిత్రదేశాలకు సైనిక సాయాన్ని పెంచింది. ఈ కోల్డ్ వార్ పరిస్థితుల్లో 1949 నుంచి 1985 మధ్యకాలంలో నాటో కూటమి దేశాల రక్షణ వ్యయాలు భారీగా పెరిగాయి. 1949లో కేవలం 13.5 బిలియన్ డాలర్లుగా ఉన్న అమెరికా రక్షణ బడ్జెట్, 1985కల్లా 266.6 బిలియన్ డాలర్లకు చేరింది.

గత మూడేళ్లుగా రష్యాతో ఉక్రెయిన్ తలపడుతోంది
2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు దిగిన తర్వాత సీన్ మారిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా గడ్డపై జరుగుతున్న అతిపెద్ద యుద్ధం ఇదే. అందుకే నాటో కూటమి దేశాలు ఇంతలా ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్ ఇరుగు పొరుగున చాలా వరకు నాటో దేశాలే ఉన్నాయి. దాదాపు గత మూడేళ్లుగా రష్యాతో ఉక్రెయిన్ తలపడుతోంది అంటే అందుకు కారణం నాటో కూటమే. 2024లో రష్యా రక్షణ బడ్జెట్ 38 శాతం పెరిగి 149 బిలియన్ డాలర్లకు చేరింది.

రష్యాతో యుద్ధంలో కుదేలైన ఉక్రెయిన్

రష్యాతో యుద్ధంలో కుదేలైన ఉక్రెయిన్ వద్ద ప్రస్తుతం నిధులు లేవు. నాటో దేశాలు, అమెరికా అందిస్తున్న నిధులతోనే ఇంతటి రేంజులో ఉక్రెయిన్ రక్షణ వ్యయం చేస్తోంది. రష్యా పొరుగునే ఉన్న మరో నాటో దేశం పోలాండ్ సైతం 2024లో జీడీపీలో 4.2 శాతాన్ని(38 బిలియన్ డాలర్లు) రక్షణ వ్యయాలకు కేటాయించింది. ఈ విషయాలు రష్యాకు కూడా తెలుసు. అందుకే ఉక్రెయిన్‌లో తాము ఆక్రమించుకున్న ప్రాంతాలను వదిలేందుకు పుతిన్ ససేమిరా అంటున్నారు. నాటో దేశాలు ఈ యుద్ధాన్ని ఎక్కడి వరకు లాగుతాయో చూడాలనే లక్ష్యంతో ఆయన ఉన్నారు.

Read Also: Earth Quake: దక్షిణ ఫిలిప్పీన్స్ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు!

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu nato defence news nato defence strategy nato eastern europe troops nato expansion nato military buildup nato military exercises nato readiness nato response to russia nato russia border nato russia conflict nato russia relations nato summit 2025 nato vs russia 2025 nato war preparation Paper Telugu News russia nato tensions russia nato war threat Russia-Ukraine War Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.