📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Naresh Goyal: ఆకాశానికి ఎదిగి.. చివరికి పాతాళములోకి జారిన నరేష్ గోయల్

Author Icon By Vanipushpa
Updated: April 14, 2025 • 12:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒకప్పుడు ఆకాశాన్ని ఏలిన జెట్ ఎయిర్‌వేస్ ఇప్పుడు మూతపడింది. నరేష్ గోయల్ తన జీవితంలోని చివరి దశలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాడు. కాగా ప్రస్తుతం అతను బెయిల్‌పై ఉంటూ ఇటీవల దేశవ్యాప్తంగా ప్రయాణించడానికి అనుమతి కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. నిజానికి, నరేష్ గోయల్ న్యూరో-ఎండోక్రైన్ ట్యూమర్ లాంటి తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నారు. అందుకు ఇండియాలోని వివిధ వైద్య సంస్థల నుండి అపాయింట్మెంట్స్ తీసుకోవాలనుకుంటున్నారు. గోయల్ సోదరి కూడా క్యాన్సర్ తో బాధపడుతోంది, కాబట్టి అతను ఆమెను కూడా కలవాలనుకుంటున్నాడు. ఆయన పిటిషన్ దాఖలు చేసినట్లు ఈ నెల ప్రారంభంలో వార్తలు వచ్చాయి. 249 రోజుల పాటు కస్టడీలో ఉన్న తర్వాత 6 మే 2024న గోయల్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. గోయల్ 1 ఏప్రిల్ 1992న జెట్ ఎయిర్‌వేస్‌ను స్థాపించారు, అది 1993లో కార్యకలాపాలను ప్రారంభించింది.

రెండు బోయింగ్ 737 విమానాలతో జెట్ లతో ఆరంభం
గోయల్ రెండు బోయింగ్ 737 విమానాలతో జెట్ ఎయిర్‌వేస్‌ను ప్రారంభించారు. అతి తక్కువ సమయంలోనే ఈ విమాన సంస్థ భారత ఆకాశంలో ఎగిరింది. దింతో గోయల్ ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఈ ఎత్తు నుండి అతను కంపెనీకి సంబంధించి వస్తున్న ఆందోళనలు, భయాలను గ్రహించడం మానేశాడు, ఆఖరికి సూచనలను కూడా పట్టించుకోలేదు. తర్వాత కాలం మలుపు తిరిగింది, గాలితో విహరిస్తున్న జెట్ ఎయిర్‌లైన్ తిరిగి ఎగరలేని విధంగా ఒక్కసారి నేలపైకి వచ్చింది. మళ్ళీ జెట్‌ ఎయిర్ వేస్ను ఆకాశంలోకి ఎగిరేలా గోయల్ చాలా కష్టపడ్డాడు. టాటా ఆసక్తి : ఆర్థిక సంక్షోభం కారణంగా జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలు 2019 ఏప్రిల్ 17న మూసివేసింది, కానీ ఈ సంకేతాలు చాలా ముందుగానే వినిపించాయి. నరేష్ గోయల్ కు కూడా చాలా చెడు జరగవచ్చని తెలుసు, అయిన అతను ఒకదాని తర్వాత ఒకటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నాడు. సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్‌ను కాపాడటానికి ఆర్థిక సలహాదారులు గోయల్ వెనక్కి తగ్గాలని సూచించారు.

ప్రతిరోజూ దాదాపు రూ.21 కోట్ల నష్టాలు
కొన్ని నివేదికల ప్రకారం వ్యాపారాన్ని మూసివేయడానికి కొన్ని రోజుల ముందు వరకు జెట్ ఎయిర్‌వేస్ ప్రతిరోజూ దాదాపు రూ.21 కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2017లో డెల్టా ఎయిర్‌లైన్స్ కూడా జెట్‌లో కొంత వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. అబుదాబి ప్రభుత్వ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎతిహాద్ ఇప్పటికే జెట్ భాగస్వామిగా ఉంది. నరేష్ గోయల్‌ సన్నిహితులు, అతను సక్సెస్ శిఖరాలకు చేరుకున్న తర్వాత కొంత గర్వంగా మారాడని చెప్పారు. తాను నమ్మకంగా ఉన్న వ్యక్తుల సామర్థ్యాలను కూడా అతను పట్టించుకోలేదు. జెట్ ఎయిర్‌వేస్‌ను తానే నడుపుతున్నానని, తన సమక్షంలో కంపెనీకి ఎం జరగదనే భ్రమలో ఉన్నాడు. కానీ సంక్షోభాన్ని పట్టించుకోకుండా ఇతరుల సలహాలను పాటించడం వల్ల అతనికి భారీ నష్టం వాటిల్లింది.

ఆర్థిక, చట్టపరమైన ఇబ్బందుల్లో నష్టాలు
చివరికి ఎయిర్ సహారాను కొనుగోలు చేయడం వల్ల జెట్ ఆర్థిక, చట్టపరమైన ఇబ్బందుల్లో పడింది. జెట్ ఎయిర్‌వేస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పుడు, కంపెనీ IPO నుండి వచ్చిన డబ్బును లోన్ భారాన్ని తగ్గించుకోవడానికి ఖర్చు చేస్తుందని నమ్మించాడు. కానీ నరేష్ గోయల్ కి వేరే ప్లాన్స్ ఉన్నాయి. 2012లో కింగ్‌ఫిషర్ మూతపడినప్పుడు, విజయ్ మాల్యా తప్పుల నుండి నేర్చుకునే అవకాశం నరేష్ గోయల్‌కు లభించింది, కానీ బహుశా అతను అలా చేయాల్సిన అవసరం లేదని భావించి ఉండవచ్చు. జెట్ అప్పుల్లో ఉన్నప్పటికీ, అతను 10 ఎయిర్‌బస్ A330, బోయింగ్ 777 విమానాలను ఆర్డర్ చేశాడు. మీడియా నివేదికల ప్రకారం, ఇటువంటి విమానాలలో 400 సీట్లు ఉండగా, జెట్ అందుకున్న విమానంలో కేవలం 308 సీట్లు మాత్రమే ఉన్నాయి. దీని కారణంగా కంపెనీ ఆశించిన విధంగా సంపాదించలేకపోగా, నష్టాల భారం పెరుగుతూనే ఉంది.
నరేష్ గోయల్ చుట్టూ ఉచ్చు, అరెస్టు
జెట్ ఎయిర్‌వేస్ సంబంధిత విషయాలపై దర్యాప్తు ముమ్మరం కావడంతో నరేష్ గోయల్ చుట్టూ ఉచ్చు బిగింది. ఈ దర్యాప్తులో ED, CBI, ఆదాయపు పన్ను వంటి సంస్థలు చేరాయి. నరేష్ గోయల్ ఆయన భార్య అనితా గోయల్, జెట్ ఎయిర్‌వేస్ మాజీ డైరెక్టర్ గౌరంగ్ ఆనంద్ శెట్టిలను నిందితులుగా సీబీఐ చేర్చింది. మనీలాండరింగ్ కేసులో గోయల్‌ను ED సెప్టెంబర్ 2023లో అరెస్టు చేసింది. కెనరా బ్యాంక్ జెట్ ఎయిర్‌వేస్‌కు ఇచ్చిన రూ.538.62 కోట్ల రుణాన్ని దుర్వినియోగం చేశాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. వైద్య కారణాల వల్ల గోయల్‌కు మే 6, 2024న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నరేష్ గోయల్ భార్య క్యాన్సర్ కారణంగా మరణించారు, గోయల్ కూడా తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారు.

Read Also: IPhone: ఇండియాలో కొత్త ఐఫోన్ల తయారీతో భారీగా ఉపాధి అవకాశాలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu eventually fell into the underworld Google News in Telugu Latest News in Telugu Naresh Goyal Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today who rose to the sky

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.