📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Narendra Modi: ప్రధాని మోదీ ఆదంపూర్ ను దర్శించేందుకు కారణాలు తెలుసా?

Author Icon By Vanipushpa
Updated: May 16, 2025 • 12:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) తరువాత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత రోజే ఆయన పంజాబ్‌(Panjab)లోని వాయుసేన స్థావరమైన ఆదంపూర్‌(Adampur) ను సందర్శించారు. మొదట ఈ పర్యటనను రహస్యంగా ఉంచారు. ఆదంపూర్‌(Adampur)లో ప్రధాని మోదీ భారత వాయుసేనకు చెందిన సీనియర్ అధికారులు, సైనికులనుద్దేశించి మాట్లాడారు. ”భారత్‌వైపు చూస్తే వినాశనం తప్ప మరే ఫలితమూ ఉండదని ఉగ్రవాదులు అర్ధం చేసుకున్నారు” అని మోదీ అన్నారు.
సర్జికల్ స్ట్రైక్
”ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత లక్ష్మణరేఖ చాలా స్పష్టం. ఉగ్రవాద దాడులకు భారత్ గట్టి జవాబు ఇస్తుంది. సర్జికల్ స్ట్రైక్ సందర్భంగా మనమీ విషయం చూశాం. వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్ భారత్ సరికొత్త విధానాలు” అని మోదీ చెప్పారు. ప్రధాని మోదీ ప్రసంగానికి సంబంధించిన ఫోటోలలో ఆయన వెనుక ఇండియా ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ, మిగ్-29 ఫైటర్ జెట్స్‌ కనిపించాయి.

Narendra Modi: ప్రధాని మోదీ ఆదంపూర్ ను దర్శించేందుకు కారణాలు తెలుసా?

ఆదంపూర్ ప్రత్యేకత ఏమిటి?
ఆదంపూర్ భారత్‌లోనే రెండో అతిపెద్ద వైమానిక స్థావరం. ఇది అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. ఆదంపూర్ రాడార్ నిఘా సామర్థ్యం పంజాబ్, జమ్మూకశ్మీర్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలతో సహా ఉత్తర భారతదేశంలోని విస్తృత ప్రాంతాలను పర్యవేక్షిస్తుంది. ‘ఆపరేషన్ సిందూర్’తో పాటు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్లలో ఇది కీలక పాత్ర పోషించింది. ఈ నెల 9 నుంచి 10వ తేదీ మధ్య, ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నం జరిగిందని, దాన్ని విఫలం చేశామని భారత్ తెలిపింది. ప్రధాని ఆదంపూర్ పర్యటనకు గల కారణాలను తెలుసుకునేందుకు భద్రతా, రాజకీయ విశ్లేషకులతో మాట్లాడింది. ఇందుకు వారు మూడు కారణాలు చెప్పారు.
ఊహాగానాలను నిలువరించడం
భారత్, పాకిస్తాన్ ఘర్షణల వేళ, పాకిస్తాన్ క్షిపణి ఆదంపూర్‌లోని గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసినట్టు పాకిస్తాన్‌ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. ఈ తప్పుడు సమాచారానికి నేరుగా సమాధానం ఇవ్వడానికే ప్రధాని మోదీ ఆదంపూర్‌కు వెళ్లారని రక్షణ, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్‌వీపీ సింగ్ చెప్పారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ ”ప్రధాని మోదీ ఆదంపూర్‌కు వెళ్లడం కేవలం ప్రతీకాత్మకం మాత్రమే కాదు. వ్యూహాత్మకంగా బాగా ఆలోచించి చేసిన ఎదురుదాడి. దీని ద్వారా తప్పుడు సమాచారాన్ని ఖండించారు. అంతే కాదు, భారతదేశపు కొత్త విధానాన్ని కూడా ఆయన బలంగా ముందుకు తెచ్చారు. చురుకుగా ఆచరణలో పెట్టారు. పాకిస్తాన్ నాశనం చేసిందని చెప్పుకుంటున్న ఎస్-400 వ్యవస్థ ముందు నిలబడి మోదీ ప్రసంగించారు. దీంతో యుద్ధం విషయంలో వినిపిస్తున్న కథనాలను, ఊహాగానాలను పూర్తిగా మార్చేశారు. ఇది భారత్ విశ్వసనీయతకు దక్కిన విజయం. ఇది సైన్యానికే కాదు యావత్ దేశానికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది” అని అన్నారు.
వాయుసేన సామర్థ్యం చూపించడం
త్రివిధ దళాల సంయుక్త ఆపరేషన్ ‘ఆపరేషన్ సిందూర్’. వాయుసేన ఇందులో కీలక పాత్ర పోషించింది. ప్రధాని తన ప్రసంగానికి ఓ వైమానిక స్థావరాన్ని ఎంచుకోవడం కూడా భారత వాయుసేన సామర్థ్యం చూపడానికి చేసిన ప్రయత్నంగా భావిస్తున్నారు. దీనిని ‘విజయ యాత్ర’గా చూస్తున్నారు రక్షణ రంగ నిపుణులు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సతీశ్ దువా.
“వైమానిక దళం ఎక్కువ వర్క్ చేసింది కాబట్టి, ప్రధాని వైమానిక దళ స్థావరాన్ని ఎంచుకున్నారు. ఇది (ఆపరేషన్ సిందూర్) సర్జికల్ స్ట్రైక్ లాగా ఆర్మీ దాడి కాదు. ఈసారి వైమానిక దళం ముందంజ వేసి బలంగా కమాండ్ తీసుకుంది’’ అన్నారు దువా. ‘‘మోదీ తన పర్యటన కోసం సరిహద్దుకు ఎక్కడో దూరంగా ఉన్న ఎయిర్ బేస్‌ కాకుండా దగ్గరగా (ఫార్వార్డ్ ఎయిర్‌బేస్)ను ఎంచుకున్నారు’’ అని దువా తెలిపారు.
మేజర్ జనరల్ (రిటైర్డ్) ఎస్‌వీపీ సింగ్ కూడా ఆయనతో ఏకీభవించారు.
ప్రతిపక్షాలకు సందేశం ఇవ్వడం
భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు ట్రంప్ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ఉపయోగించుకున్నాయి. ప్రపంచానికి సందేశం ఇవ్వడంతోపాటు, భారతదేశంలోనూ రాజకీయ సందేశం ఇవ్వడానికి ప్రధాని ఆదంపూర్‌ను ఎంచుకున్నారని రాజకీయ విశ్లేషకుడు, దిల్లీ విశ్వవిద్యాలయంలోని హిందూ కళాశాల పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ చంద్రచూడ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌కు ఎంత నష్టం జరిగిందో నిలదీసేందుకు ప్రతిపక్షాలు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి. ఆదంపూర్‌ను ఉదాహరణగా చూపడం ద్వారా భారత్‌కు జరిగిన నష్టంపై వస్తున్న వార్తలన్నీ అబద్ధాలేననే సందేశాన్ని ప్రధాని ఇస్తున్నారు. ఈ ఘర్షణలో భారత్ విజయం సాధించిన విషయాన్ని ఆయన ఫోటో ధ్రువీకరిస్తోందన్నారు.

Read Also: Foreign Minister: పాకిస్థాన్ వద్ద ఉగ్రవాదుల జాబితా ఉంది: జైశంకర్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Narendra Modi Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today visited Adampur..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.