📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Nara Lokesh: బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో లోకేశ్‌ భేటీ..ఏఐ టూల్స్ వినియోగంపై చర్చ

Author Icon By Anusha
Updated: June 19, 2025 • 1:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రంలో విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాలను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమైన అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ న్యూఢిల్లీల, బ్రిటన్ మాజీ ప్రధాని, టోనీ బ్లెయిర్ ని కలిశారు. టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (TBI) వ్యవస్థాపకుడైన బ్లెయిర్‌తో జరిగిన ఈ భేటీలో విద్య, నైపుణ్యాభివృద్ధి, మంచి పాలన (Good governance) వంటి అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సమావేశం ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో జరిగింది.ఏపీ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఎఐ టూల్స్ ను ఉపయోగించడానికి తమ సంస్థ అయిన టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్(టిబిఐ) ద్వారా సహకరించేందుకు టోనీ బ్లెయిర్ అంగీకరించారు. 

ఏపీ విద్యాశాఖ

ఆ మేరకు విద్యారంగంలో అధునాతన సాంకేతికతను అమలుచేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి ఏపీ విద్యాశాఖ, టోనీబ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (టీబీఐ) నడుమ 2024 డిసెంబర్ లో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా టీబీఐ విజయవాడలో తమ ఎంబెడెడ్ బృందాన్ని (Embedded team) మొహరించి రెండు ప్రధాన అంశాలపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తోంది. అందులో 1. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యలో సంస్కరణలు 2. గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్థాపన. ఏపీ విద్యాశాఖ, టీబీఐ నడుమ ఒప్పందం తర్వాత, ఏ మేరకు పురోగతి సాధించారనే అంశంపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా సమీక్షించారు. 

Nara Lokesh

ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ

రాష్ట్రంలో అమలుచేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (GiGG) సలహా బోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లెయిర్ ను మంత్రి లోకేశ్‌ (Lokesh) ఈ సందర్భంగా ఆహ్వానించారు. నైపుణ్య శిక్షణ (Skill training) అంశాలు, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు స‌హకారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆగస్టులో విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్ కు టీబీఐ (TBI) భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లెయిర్ అన్నారు. ఈ సమావేశంలో విద్య శాఖ కార్యదర్శి కోన శశిధర్, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also: Harsha Kumar: పాస్టర్ ప్రవీణ్ మృతిపై హైకోర్టులో హర్షకుమార్ పిల్

#NaraLokesh #TBI #TonyBlair #TonyBlairInstitute Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.