Nangthoi Sharma: అందమైన ఆ చిరునవ్వు మాయమైన వేదన

Read Time:  1 min
Nangthoi Sharma: అందమైన ఆ చిరునవ్వు మాయమైన వేదన
FONT SIZE
GET APP

గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని కలిగించింది. అయితే ఈ దుర్ఘటన మణిపూర్ రాష్ట్రానికి చెందిన కుటుంబాలను తీవ్రంగా కలచివేసింది.ఈ దుర్ఘటనలో ఆ రాష్ట్రానికి చెందిన,ప్రతిభావంతులైన యువతి, ఎయిర్ ఇండియాలో ఫ్లైట్ అటెండెంట్ గా పనిచేస్తున్న నంగ్థోయ్ శర్మ కొంగ్‌బ్రైలత్‌పమ్ (Nangthoi Sharma)ప్రాణాలు కోల్పోయింది. అందమైన ఆ చిరునవ్వు మాయమైన వేదన. ఈ వార్త తెలియడంతో వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.ఇంఫాల్‌లోని డీఎం కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో నంగ్థోయ్ శర్మ ఎంపికయ్యారు.

ఎయిర్ ఇండియా

ముగ్గురు ఆడపిల్లల్లో రెండవ అమ్మాయి అయిన నంగ్థోయ్ 19ఏళ్లకే ఎయిర్‌ ఇండియాలో ఎయిర్‌హోస్టెస్‌గా చేరింది. అదే విమానంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచి వేస్తోంది.టీనేజ్‌లోనే ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించి కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఆమె తండ్రి నందేశ్ కుమార్ శర్మ (Nandesh Kumar Sharma) మాట్లాడుతూ“12న ఉదయం 11:30 గంటలకు నంగ్థోయ్ తన సోదరికి చివరిసారిగా ఫోన్ చేసింది. తాను లండన్ వెళ్తున్నానని, కొన్ని రోజులు మాట్లాడలేనని చెప్పింది. జూన్ 15న తిరిగి రావాల్సి ఉంది. అదే మాకు ఆమె చివరి మాటలవుతాయని ఊహించలేదు” అని కన్నీటిపర్యంతమయ్యారు.

Nangthoi Sharma: అందమైన ఆ చిరునవ్వు మాయమైన వేదన
Nangthoi Sharma

ఆన్‌లైన్ వార్తలు

ఆమె కాల్ చేసిన మూడు గంటల తర్వాత విమాన ప్రమాదం గురించి ఓ బంధువు ఫోన్‌లో చెప్పడంతో నంగ్థోయ్ సోదరి తీవ్ర ఆందోళనకు గురైంది. గత వారం అరమ్‌బాయ్ టెంగ్‌గోల్(Arambay Tenggol) సభ్యుడి అరెస్ట్‌కు నిరసనగా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో వారికి ఆన్‌లైన్ వార్తలు అందుబాటులో లేవు. నంగ్థోయ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు రాసిన వెంటనే స్నేహితులతో కలిసి ఎయిర్ హోస్టెస్ ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగం సాధించిందని, ముంబైలో మణిపూర్‌(Manipur)కు చెందిన ఇతర ఎయిర్ ఇండియా ఉద్యోగినులతో కలిసి ఉండేదని ఆమె తండ్రి గుర్తుచేసుకున్నారు. ఎప్పటికైనా మణిపూర్‌లో స్థిరమైన ఉద్యోగం చేస్తుందని ఆశించామని తెలిపారు.

Read Also: Iraq: ఇరాక్‌ నుంచి అమెరికా రాయబార సిబ్బంది తరలింపు

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.