📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Pahalgam Attack: కళ్ల ఎదుటే నా భర్తను చంపారు: మంజునాథ్​ భార్య

Author Icon By Vanipushpa
Updated: April 23, 2025 • 1:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్ముకశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త మంజునాథ్ ప్రాణాలు విడిచాడు. ఆ సమయంలో అక్కడే అతడి భార్య పల్లవి, 18 ఏళ్ల కుమారుడు అభిజేయ ఉన్నారు. మంజునాథ్​తో పాటు తమను చంపేయని వారిద్దరూ టెర్రరిస్టును కోరగా, అందుకు ముష్కరుడు నిరాకరించాడు. పల్లవి, ఆమె కొడుకును చంపనని, అందుకు బదులుగా దాడి గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పుకోమని అన్నాడని పల్లవి విలపించారు.

ఏమి జరిగిందో నాకు అర్థం కాలేదు
“నా భర్త పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో నా కళ్ల ఎదుటే మరణించాడు. నేను అప్పుడు ఏడవలేకపోయాను. స్పందించలేకపోయాను. ఏమి జరిగిందో నాకు అర్థం కాలేదు. కర్ణాటకలోని శివమొగ్గ నుంచి నా భర్త మంజునాథ్, కుమారుడు అభిజేయతో ఇక్కడికి వచ్చాను. కారు డ్రైవర్ కూడా మాతో వచ్చాడు. అతడు చాలా మంచి వ్యక్తి. ముష్కరులు హిందువులనే లక్ష్యంగా చేసుకుంటున్నారని అతడు నాతో చెప్పాడు. ముగ్గురు వ్యక్తులు మమ్మల్ని సురక్షితంగా కాపాడారు. నా భర్త మృతదేహాన్ని విమానంలో తరలించాలని ప్రభుత్వాన్ని కోరా” అని పల్లవి తెలిపారు.
ప్రధాని మోదీకి చెప్పుకో అన్నారు
“ముగ్గురు ఉగ్రవాదులు నా భర్తపై దాడి చేసి చంపేశారు. అందులో ఓ వ్యక్తికి ఎదురెళ్లాను. ‘నువ్వు నా భర్తను చంపావు. నన్ను కూడా చంపు’ అన్నాను. నా కొడుకు కూడా అతన్ని ఎదుర్కొని ‘నువ్వు నా తండ్రిని చంపావు. మమ్మల్ని కూడా చంపేయ్’ అన్నాడు. నేను నిన్ను చంపను. వెళ్లి దాడి గురించి ప్రధాని మోదీకి చెప్పు అని బదులిచ్చాడు” అని పల్లవి విలపిస్తూ మీడియాకు వివరించింది. ‘ఆర్మీ యూనిఫామ్​లో రాలేదు’
ఉగ్రవాదులు అందరూ సైనిక యూనిఫామ్​లో రాలేదని పల్లవి చెప్పుకొచ్చారు. పురుషులే లక్ష్యంగా కాల్పులు జరిపారని తెలిపారు. పహల్గాంకు చాలా మంది నూతన వధూవరులు వచ్చారని చెప్పారు. మహిళలను వదిలేసి వారి భర్తలపై ఉగ్రవాదులు కాల్పుల జరిపారని గుర్తు చేసుకున్నారు. హిందువులు లక్ష్యంగా ముష్కరులు రెచ్చిపోయారని వెల్లడించారు.
‘కొడుక్కు రొట్టె తేవడానికి వెళ్లి మరణం’
“మేం పహల్గాంకు గుర్రంపై వెళ్లాం. నా కొడుకు ఉదయం నుంచి ఏం తినలేదు. కాబట్టి నా భర్త రొట్టె తీసుకురావడానికి వెళ్లారు. మొదట మేం తుపాకీ కాల్పుల శబ్దాలు విన్నాం. సైన్యం కాల్పులు జరిపిందని అనుకున్నాం. అప్పుడు ప్రజలు పరిగెత్తడం ప్రారంభించారు. నా భర్త అప్పటికే కుప్పకూలిపోయి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని తలపై కాల్పులు జరిపారు.” అని పల్లవి చెప్పారు.
ఇంకా తల్లికి తెలియని మంజునాథ్ మరణవార్త
కాగా, కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్ రియల్టర్. అతడి భార్య పల్లవి బ్యాంక్ మేనేజర్. ఈ దంపతులు తమ కుమారుడితో కలిసి ఏప్రిల్ 19న కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఏప్రిల్ 24న తిరిగి రావాల్సి ఉంది. అంతలోనే ముష్కరుల కాల్పుల్లో మంజునాథ్ ప్రాణాలు విడిచారు. మంజునాథ్ తల్లికి తన కొడుకు మరణం గురించి ఇంకా చెప్పలేదు. అతడు గాయపడ్డాడని, త్వరలోనే సురక్షితంగా తిరిగి వస్తాడని చెప్పారు.

Read Also: KCR: ఉగ్రదాడిపై కేసీఆర్, కేటీఆర్, కవిత దిగ్భ్రాంతి వ్యక్తం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in front of my eyes Latest News in Telugu Manjunath's wife My husband was killed Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.