📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Israel: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. మండిపడుతున్న ముస్లిం దేశాలు

Author Icon By Vanipushpa
Updated: June 17, 2025 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్‌(Iran)పై ఇజ్రాయెల్(Israel) జరిపిన వైమానిక దాడులను 21 అరబ్, ముస్లిం దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు సోమవారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ప్రాంతీయంగా ఉద్రిక్తతలను తగ్గించాలని, ఎలాంటి వివక్ష లేకుండా అణ్వస్త్ర(Nuclear) నిరాయుధీకరణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని ఆ దేశాలు పిలుపునిచ్చాయి. ఈజిప్టు(Egypt) విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాటీ చొరవతో పలు దేశాల విదేశాంగ మంత్రులతో జరిపిన సంప్రదింపుల అనంతరం ఈ ప్రకటన వెలువడిందని ఈజిప్టు అధికారిక వార్తా సంస్థ ‘మెనా’ వెల్లడించింది.

Israel: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు మండిపడుతున్న ముస్లిం దేశాలు

ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేసిన దేశాల్లో తుర్కియే, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), పాకిస్థాన్, బహ్రెయిన్, బ్రూనై, చాద్, గాంబియా, అల్జీరియా, కొమొరోస్, జిబౌటి, సౌదీ అరేబియా, సూడాన్, సోమాలియా, ఇరాక్, ఒమన్, ఖతార్, కువైట్, లిబియా, ఈజిప్ట్, మౌరిటానియా ఉన్నాయి. ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్ జరిపిన దాడులను అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘించడమేనని విదేశాంగ మంత్రులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటన ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాటీ చొరవతో, పలు దేశాల విదేశాంగ మంత్రులతో జరిగిన సంప్రదింపుల అనంతరం వెలువడింది. అధికారికంగా ఈ ప్రకటనను ‘మెనా’ వార్తా సంస్థ వెల్లడించింది.
వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
జాతీయ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, మంచి పొరుగు సంబంధాల సూత్రాలను గౌరవించాల్సిన ఆవశ్యకతను ఈ ప్రకటనలో వారు నొక్కి చెప్పారు. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రస్తుత ప్రమాదకరమైన ఉద్రిక్తతల పట్ల మంత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రాంతీయ భద్రత, స్థిరత్వంపై తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ తన శత్రుత్వ చర్యలను తక్షణమే నిలిపివేయాలని వారు పిలుపునిచ్చారు.

Read Also: Israel-Iran War : యుద్ధంలోకి అమెరికా?

#IranUnderAttack #IsraelIranConflict #MiddleEastTensions #telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News StopTheViolence Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.