📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Musk: ట్రంప్ తో విభేదాలతో మస్క్‌కు భారీ నష్టం

Author Icon By Vanipushpa
Updated: June 9, 2025 • 11:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)తో విభేదాలతో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్(Elon Musk) సతమతమవుతున్నారు. ఇద్దరి మధ్యా గొడవలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు. ట్రంప్‌కు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశ్యంతో మస్క్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. ట్రంప్‌తో గొడవలతో ఇబ్బందిపడుతున్న మస్క్‌కు సూర్యుడు షాక్ ఇస్తున్నాడు. కోట్ల రూపాయల నష్టం తెస్తున్నాడు. ఒకరకంగా స్టార్ లింక్ ప్రాజెక్టును దెబ్బ తీస్తున్నాడు. ఇంతకీ సంగతేంటంటే.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్ నెట్ సేవలు అందించడానికి మస్క్ స్టార్ లింక్ ప్రాజెక్టును చేపట్టారు.

Musk: ట్రంప్ తో విభేదాలతో మస్క్‌కు భారీ నష్టం

స్టార్ లింక్ ఇంటర్ నెట్ సేవల కోసం శాటిలైట్లు
అమెరికాలో స్టార్ లింక్ సేవలు అందుబాటులో ఉన్నాయి. స్టార్ లింక్ ఇంటర్ నెట్ సేవల కోసం మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ పెద్ద సంఖ్యలో శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపింది. అయితే, భూకక్ష్యలో ఉన్న స్టార్ లింక్ శాటిలైట్లు గత కొన్నేళ్ల నుంచి కిందకు పడిపోతున్నాయి. భూమి వాతావరణంలోకి వచ్చేస్తున్నాయి. సూర్యుడి వేడి దీనికి కారణం కావటం గమనార్హం. సూర్యుడి వేడి కారణంగా తరచుగా భూ అయస్కాంత తుఫానులు వస్తున్నాయి. వీటి కారణంగా భూకక్ష్యలో ఉన్న శాటిలైట్లు భూవాతావరణంలోకి పడిపోతున్నాయి.
మస్క్‌కు భారీ నష్టం ఎందుకంటే!
ఊహించిన దానికంటే ముందుగానే శాటిలైట్లు భూవాతావరణంలో పడిపోతున్నాయి. 2020 నుంచి 2024 మధ్య కాలంలో ఏకంగా 523 స్టార్ లింక్ శాటిలైట్లు భూవాతావరణంలోకి వచ్చేసినట్లు నాసా తెలిపింది. స్పేస్ ఎక్స్ మొత్తం 8,873 స్టార్ లింక్ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపింది. వాటిలో ప్రస్తుతం 7,669 మాత్రమే పని చేస్తున్నాయి. స్పేస్ ఎక్స్ తయారు చేసిన శాటిలైట్ల జీవిత కాలం చాలా తక్కువ. అవి భూకక్ష్యలో కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. తర్వాత భూమి వాతావరణంలోకి పడిపోతాయి. భూమిని చేరేకంటే ముందే కాలి బూడిద అయిపోతాయి. కానీ, సూర్యుడి కారణంగా ఐదేళ్ల కంటే ముందే శాటిలైట్లు భూవాతావరణంలో పడిపోతున్నాయి. దీని వల్ల మస్క్‌కు భారీ నష్టం వస్తోంది.

Read Also: Fake ICE Agent : అమెరికాలో భారతీయ యువతికి షాక్ : 5 వేల డాలర్ల నష్టం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu due to differences with Trump Google News in Telugu Latest News in Telugu Musk suffers huge loss Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.