📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Elon Musk: లైంగిక వేధింపులో ట్రంప్‌కు సంబంధాలు..: వీడియోలతో బయటపెట్టిన మస్క్

Author Icon By Vanipushpa
Updated: June 6, 2025 • 3:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk) మధ్య ‘ఎక్స్’ వార్ కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. అది కాస్తా చిలికి చిలికి గాలి వానలా మారుతోంది. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమిర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే మస్క్.. తానే లేకపోతే ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయేవారని చెప్పారు. అక్కడితో ఆగకుండా తాజాగా అమెరికాలోని అతిపెద్ద కుంభకోణమైన సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేశారు.

ElonMusk: లైంగిక వేధింపులో ట్రంప్‌కు సంబంధాలు..: వీడియోలతో బయటపెట్టిన మస్క్

హాట్‌టాపిక్‌గా మారిన మస్క్ వ్యాఖ్యలు
అమెరికా రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఎక్స్ వేదికగా ఇందుకు సంబంధించి పోస్ట్ పెట్టారు. అందులో అతిపెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నం అయిందంటూ రాసుకొచ్చారు. అమెరికాలోనే అతిపెద్ద కుంభకోణం అయిన సెక్స్ కుంభకోణం నిందితుడు అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉందని వివరించారు.
కొన్ని ఫొటోలు, వీడియోలను మస్క్ షేర్
కానీ భవిష్యత్తులో ఇందుకు సంబంధించిన పూర్తి నిజానిజాలు వెలుగులోకి వస్తాయని.. ప్రపంచం మొత్తానికి దీని గురించి తెలుస్తుందని మస్క్ తెలిపారు. ఈ సందర్భంగానే ట్రంప్‌ను అభిశంసించాలంటూ ఒక నెటిజన్ పెట్టిన పోస్టును మస్క్ సమర్థించారు. అలాగే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ఆ పోస్టులో ఉండగా.. మస్క్ దీన్ని రీపోస్ట్ చేశారు. అలాగే ఇందుకు తన పూర్తి మద్దతును తెలిపారు. ఇది మాత్రమే కాకుండా ట్రంప్, ఎప్‌స్టీన్‌లకు సంబంధించ కొన్ని ఫొటోలు, వీడియోలను కూడా మస్క్ షేర్ చేశారు.
అసలెవరీ జెఫ్రీ ఎప్‌స్టీన్‌?
అమెరికాలోని అతిపెద్ద సెక్స్ కుంభకోణంలో నిందితుడు అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌ 2019లో జైల్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడి కాంటాక్ట్ లిస్టు, ఫ్లైట్ లాగ్ సమాచారాన్ని అధికారులు బయట పెట్టారు. మొత్తం 200 పేజీలు కల్గిన ఈ జాబితాలో ప్రముఖల పేర్లు వెలుగులోకి వచ్చాయి.

https://twitter.com/elonmusk/status/1930727302566174971

Read Also: Tonmoy Sharma: తన్మయ్ శర్మ రూ.1,244 కోట్ల కుంభకోణం..అరెస్ట్‌

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Musk exposes Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Trump's links to sexual harassmen with videos

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.