📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Elon Musk: ట్రంప్‌ బిల్లుపై మస్క్‌ విమర్శలు

Author Icon By Vanipushpa
Updated: June 4, 2025 • 10:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Elon Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సర్కార్ రూపొందించిన పన్ను మినహాయింపు బిల్లుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) మరోసారి విమర్శించారు. ట్రంప్ పేర్కొంటున్న వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌ యాక్ట్‌ దారుణంగా ఉందని అభివర్ణించారు. డోజ్​ విభాగానికి ఇటీవల వీడ్కోలు పలికిన కొద్ది రోజులకే ఎక్స్​లో ఈ మేరకు పోస్ట్​ చేశారు.
ఇది అత్యంత దారుణమైనది: మస్క్
‘నన్ను క్షమించండి. నేను ఇక భరించలేను. ఇది అత్యంత దారుణమైనది. కాంగ్రెస్‌లో తీసుకొచ్చిన బిల్లు చాలా చెడ్డది. అది తప్పు అని మీకు తెలుసు. అయినా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారంటే అది మీకే అవమానం’ అని ఎక్స్​(X)లో రాసుకోచ్చారు. ఈ సందర్బంగా ట్రంప్ తీసుకురానున్న బిల్లు కారణంగా ఇప్పటికే ఉన్న ద్రవ్య లోటు 2.5 ట్రిలియన్​ డాలర్లకు పెరుగుతుందని ఎలాన్ మస్క్ హెచ్చరించారు. దీంతో అమెరికన్లపై భరించలేని భారం పడుతోందని పేర్కొన్నారు.

Elon Musk: ట్రంప్‌ బిల్లుపై మస్క్‌ విమర్శలు

మస్క్‌ చేసిన ఈ వ్యాఖ్యలను వైట్‌హౌస్‌ స్పందించింది. ఈ బిల్లుపై మస్క్‌ అభిప్రాయం ఏంటనేది అధ్యక్షుడు ట్రంప్‌నకు తెలుసుంటూ ఖండించింది. ఇది ట్రంప్‌ అభిప్రాయాన్ని మార్చదని ప్రెస్‌ సెక్రటరీ కరోలినా లివిట్‌ తెలిపారు. రానున్న బిల్లు గొప్పదని, ఆయన దానికి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. అలాగే ఈ బిల్లుపై మస్క్‌ చేసిన వ్యాఖ్యలు తనను నిరాశపరిచాయని హౌస్ స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ కూడా స్పందించారు. కాగా ట్రంప్‌నకు వ్యతిరేకంగా గళం విప్పిన మస్క్‌కు రిపబ్లికన్ల నుంచి మద్దతు లభిస్తోంది. మస్క్‌ చెప్పింది నిజమేనని ఆ పార్టీకి చెందిన ప్రతినిధి థామస్‌ అన్నారు.
బిల్లుకు నిరసనగానే మస్క్ రాజీనామా
గతంలోనే వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌ యాక్ట్​కు ఎలాన్​ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బిల్లు ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచుతుందని ఆ సమయంలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలనే డోజ్‌ ఆశయాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ బిల్లు కోసం అధిక బడ్జెట్​ను కేటాయించాల్సి వస్తుండటం వల్ల డోజ్ తీసుకున్న చర్యలు ఈ నిర్ణయంతో వృథా అవుతాయని అన్నారు. ఈ బిల్లుకు నిరసనగానే మస్క్ తన పదవి నుంచి వైదొలగారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ట్రంప్‌ రెండోసారి అమెరికా ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక ఎలాన్‌ మస్క్‌ను తన పాలకవర్గంలోకి సలహాదారుగా నియమించారు. ప్రభుత్వంలో పెద్దఎత్తున వృథా ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా డోజ్‌ శాఖను ఏర్పాటు చేసి ఆ బాధ్యతలు ఎలాన్​మస్క్​కు అప్పగించారు. దీంతో సమూల మార్పుల దిశగా మస్క్‌ అనేక ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు అమెరికా సర్కార్​కు సూచనలు చేశారు. ప్రభుత్వంలో ఆయన జోక్యం పెరుగుతోందంటూ విపరీతమైన విమర్శలు వచ్చాయి.

Read Also: Imran Khan : మునీర్ పై ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Musk criticizes Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Trump's bill

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.