📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Tahawwur Rana: భారీ భద్రత మధ్య ఢిల్లీ కి చేరుకోనున్న ముంబై ఉగ్రవాది హై-సెక్యూరిటీ ఏర్పాటు

Author Icon By Anusha
Updated: April 9, 2025 • 3:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముంబై నగరంలో 2008 నవంబర్ 26న జరిగిన భయంకరమైన ఉగ్రదాడులను భారతదేశ చరిత్రలో ఎవరు మరిచిపోలేరు. పాకిస్తాన్‌లోని లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబైకి చేరుకుని, నగరంలోని పలు కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్, నరిమన్ హౌస్, కామా హాస్పిటల్, లియోపోల్డ్ కేఫ్ వంటి ప్రాంతాల్లో ఏకే-47 రైఫిళ్లు, గ్రనేడ్లు, ఆర్ డిఎక్స్ బాంబులతో ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో ఏకంగా 175 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 600 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 60 గంటల పాటు సాగిన ఈ దాడులను జాతీయ భద్రతా గార్డ్ (ఎన్ఎస్ జి) కమాండోలు అంతమొందించారు. ఈ ఘటనలో పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను 2012లో భారత ప్రభుత్వం ఉరితీసింది.

చిత్రహింసలకు గురిచేస్తారని

ముంబై దాడుల కేసులో లాస్ ఏంజెల్స్ లోనిమెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నాడు. అతడిని తమకు అప్పగించాలని భారత్‌ కొంతకాలంగా కోరుతోంది. దీన్ని సవాల్‌ చేస్తూ తహవూర్‌ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించాడు. ఆయా కోర్టుల్లో అతడికి చుక్కెదురైంది. గతేడాది నవంబరు 13న అమెరికా సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్ వేయగా అక్కడా నిరాశే ఎదురైంది.భారత్‌కు అప్పగించేందుకు అమెరికా అధికారులు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో తన అప్పగింతను అత్యవసరంగా నిలిపివేయాలని మళ్లీ అక్కడి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. భారత్‌కు పంపిస్తే తనను చిత్రహింసలకు గురిచేస్తారని అందులో ఆరోపించాడు. విచారణ జరిపిన న్యాయస్థానం రాణా పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే భారత అధికారుల బృందం అగ్రరాజ్యానికి వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించి చట్టపరమైన పనులన్నీ పూర్తి చేసింది.

భద్రతా ఏర్పాట్లు

భారత అధికారులు బుధవారం (ఏప్రిల్ 9) రాత్రికి లేదా గురువారం భారత్‌కు తీసుకొచ్చే అవకాశం ఉంది. అమెరికా జైలులో ఉన్న రాణాను అక్కడి అధికారులు భారత్‌కు అప్పగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడిని చట్టం ముందు నిలబెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రాణా అప్పగింతతో ముంబై దాడుల్లో పాకిస్థాన్‌ ప్రభుత్వ పాత్ర బహిర్గతంకానుందని భారత ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పాక్ కుట్రలో కొత్త కోణాలు కూడా వెల్లడయ్యే అవకాశముందని సమాచారం. తహవూర్‌ రాణాను తీసుకొచ్చిన తర్వాత న్యాయపరమైన ప్రక్రియల తర్వాత అతడిని ఎన్​ఐఏ కస్టడీలోకి తీసుకునే అవకాశముంది.భారత్‌కు వచ్చిన వెంటనే రాణాను ఢిల్లీ ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచనున్నారు. ఆ తర్వాత జైలుకు తరలించనున్నారు. అమెరికా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాణా కోసం అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తహవూర్ రాణా రాకతో, ఈ కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Read Also: Rafale Fighter Jet: రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో ఒప్పందం

#2611TerrorAttack #JusticeForMumbai #MumbaiAttacks #RanaExtradition #TahawwurRana Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.