📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Modi: పాకిస్థాన్‌ను మరోసారి హెచ్చరించిన మోదీ

Author Icon By Anusha
Updated: May 27, 2025 • 5:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్‌కు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. మొది రోజులో భాగంగా మంగళవారం రోజు పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ఓ సభలో జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.దేశంలో ఉగ్రవాద దాడుల ద్వారా అశాంతి సృష్టించాలని చూస్తే సహించేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పాకిస్థాన్‌ను హెచ్చరించారు.ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ గురించి చెబుతూ,ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్థాన్ ఉగ్రదాడులతో భారత్‌లో అలజడి సృష్టించాలని చూస్తే మౌనంగా ఉండబోమని హెచ్చరించారు. అలాగే 1947లో దేశ తొలి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సలహాను గుర్తు చేశారు. ఆయన మాటను నాడు నెహ్రూ సర్కారు విని ఉంటే పహల్గాం ఉగ్రదాడి జరిగేది కాదన్నారు.

ఉగ్రవాదుల

ఉగ్రవాదాన్ని పాక్ ఒక యుద్ధ వ్యూహంగా అనుసరిస్తోందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. దీన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కుంటోందన్నారు. పాక్‌లో ఉగ్రవాదుల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేశారని చెప్పారు. అలాగే సర్కారు అధికారులు సైతం పాల్గొని ఉగ్రవాదులకు నివాళులు అర్పించారని తెలిపారు. ఆ దేశ ఆర్మీ సైతం ముష్కరుల మృతదేహాలకు సెల్యూట్ చేసిందన్నారు.

Modi: పాకిస్థాన్‌ను మరోసారి హెచ్చరించిన మోదీ

తొలిసారి

భారత్ ఎవరితోనూ యుద్ధం కోరుకోవడం లేదని మేము శాంతంగా ఉండడంతో పాటు ఇతరులు అలాగే ఉండాలనుకుంటామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కానీ పరోక్ష యుద్ధంతో మా బలాన్ని పరీక్షిస్తే సహించేదీ లేదన్నారు. 1947 నాటి భారత విభజన గురించి కూడా మోదీ సభలో ప్రస్తావించారు. అప్పుడే భారత్ రెండు ముక్కలు అయిందన్నారు. అదే రోజు రాత్రి కశ్మీర్‌లో తొలిసారి ఉగ్రదాడి జరిగిందని చెప్పుకొచ్చారు. ఆరోజునే ఉగ్రవాదులను ఏరివేసి, ఆక్రమిత కశ్మీర్‌(Aakramitha Kashmir)ను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ సలహా విని ఉంటే భారత్‌లో ఉగ్రదాడుల పరంపరం కనిపించేదని కాదన్నారు. కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలు సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట వినలేదని చెప్పుకొచ్చారు.

Read Also: Stock Markets: భారీ నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

#IndiaAgainstTerrorism #narendramodi #PakistanWarning #TerrorismWillNotWin Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Operation Sindoor Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.