ఉగ్రవాదులపై ఆంక్షలు విధించడంలో వెనుకాడకూడదని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. ఉగ్రవాద బాధితులు, మద్దతుదారులను ఒకే త్రాసులో తూకం వేయలేమని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బ్రెజిల్(Brazil)లోని రియో డి జనీరో నగరం వేదికగా ఆదివారం ప్రారంభమైన బ్రిక్స్ సదస్సు(Brics summit)లో భాగంగా శాంతి, భద్రతలపై జరిగిన ప్రత్యేక సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ ఆత్మపై చేసిన ప్రత్యక్ష దాడి : మోదీ
ఇటీవల జరిగిన పహల్గాం(Pahalgam) ఉగ్రదాడిని భారత ఆత్మ, గుర్తింపు, గౌరవంపై ప్రత్యక్ష దాడిగా మోదీ అభివర్ణించారు. ఉగ్రవాదం ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాల్ అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి భారతదేశానికి మాత్రమే కాదు, మొత్తం మానవాళికి ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని ఖండించడం మన సూత్రం మాత్రమే కాదని, బాధ్యత అని అన్నారు.
శాంతి భద్రతలపై ప్రత్యేక సమావేశంలో ప్రసంగం
బ్రిక్స్ సదస్సులో భాగంగా శాంతి & భద్రతలపై ప్రత్యేక సెషన్ జరిగింది.
ఈ సమావేశంలో మోదీ ఉగ్రవాదాన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్రమైన ముప్పుగా వివరించారు.
అంతర్జాతీయ ఐక్యత, సహకారం ద్వారా మాత్రమే దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని పిలుపునిచ్చారు.
“ఇది కేవలం భారత్‌పై కాదు – మన దేశ ఆత్మపై దాడి” అని చెప్పారు.
అది భారత గౌరవం, గుర్తింపు, మానవీయ విలువలపై జరుగిన దాడిగా అభివర్ణించారు.
అంతే కాదు, “ఉగ్రవాదాన్ని ఖండించడం కేవలం ఒక సూత్రం కాదు – అది మన బాధ్యత” అని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: IND vs ENG: టెస్టు సిరీస్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా