📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

NarendraModi: క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉంటామన్న మోదీ..

Author Icon By Anusha
Updated: March 29, 2025 • 3:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మయన్మార్‌లో చోటుచేసుకున్న భారీ భూకంపం అనంతరం, భారత ప్రభుత్వం “ఆపరేషన్ బ్రహ్మ” పేరిట సహాయ చర్యలను ప్రారంభించింది. విపత్తు సహాయక సామగ్రిని, అత్యవసర సేవలను అందించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ మయన్మార్ మిలిటరీ అధినేత సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హలాయింగ్‌కు భరోసా ఇచ్చారు.

రిక్టర్ స్కేల్‌

మయన్మార్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.2గా నమోదైందని అక్కడి నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తాజా ప్రకటనలో వెల్లడించింది. భూకంపం రావడంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంపం తీవ్రతకు భవనాలు కంపించడం, ఒక బిల్డింగ్‌లోని స్విమ్మింగ్ పూల్ నుంచి భారీగా నీళ్లు కింద పడటం, హోటల్‌లో జనాలు భోజనం చేస్తున్న సమయంలో భవంతులు కదలడానికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. మయన్మార్‌లో భూకంపాలు కొత్త కాదు. ఈ నెల ఆరంభంలో కూడా అక్కడ భూమి కంపించింది. ఆ టైమ్‌లో 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది.

భారత ప్రధాని మోదీ స్పందన

భూకంపం సంభవించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ మయన్మార్ సైనిక అధినేత మిన్ ఆంగ్ హలాయింగ్‌తో ఫోన్ ద్వారా మాట్లాడారు.భూకంప ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు, మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు,భారతదేశం మయన్మార్ ప్రజలతో ఉందని భరోసా ఇచ్చారు.ప్రస్తుతం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు.

భారత్‌ సహాయం

భూకంప బీభత్సంతో మయన్మార్ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సహాయక చర్యలకు ముందుకొచ్చింది. ఢిల్లీ నుంచి 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ పంపించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, ఏఎఫ్ఎస్ హిండన్ నుంచి ఐఏఎఫ్ సి 130 జె విమానం సహాయక సామగ్రితో బయలుదేరింది. ఈ సహాయ సామగ్రిలోటెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, దుప్పట్లు,తినడానికి సిద్ధంగా ఉన్న భోజనం,వాటర్ ప్యూరిఫైయర్స్, హైజీన్ కిట్లు,సోలార్ ల్యాంప్స్, జనరేటర్ సెట్లు,తదితర అత్యవసర వస్తువులు ఉన్నాయి. మయన్మార్‌లో సహాయక చర్యలు కొనసాగించేందుకు భారత్ తక్షణ చర్యలు చేపట్టింది.

ఎన్డీఆర్ఎఫ్ బృందం

ఈ విపత్తు సమయంలో భారత ప్రభుత్వం మయన్మార్‌కు తక్షణ సాయం అందించేందుకు ముందుకొచ్చింది. 80 మంది ఎన్డీఆర్ఎఫ్ (ఎన్ డిఆర్ ఎఫ్) సిబ్బంది సహాయ చర్యలకు తరలింపు,విపత్తు సహాయక సామగ్రితో ప్రత్యేక విమానం మయన్మార్‌కు రవాణా,భూకంప బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక బృందాలు,ఒక సీనియర్ అధికారిని నియమిస్తూ, భారత్ సహాయ చర్యల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని అధికారికంగా ప్రకటించారు.

భారత్ తో పాటు ఇతర దేశాల సహాయం

భూకంపంతో మయన్మార్ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, ఇతర దేశాలు కూడా ముందుకొచ్చాయి.అమెరికా, ఇండోనేషియా, చైనా – మయన్మార్‌కు అవసరమైన సహాయం అందించనున్నట్లు ప్రకటించాయి. యునైటెడ్ నేషన్స్ – తక్షణ ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించింది.ఇండోనేషియా ప్రభుత్వ సంస్థలు – తాత్కాలిక నివాసాల ఏర్పాటుకు ప్రత్యేక బృందాలను పంపించాయి.

#DisasterRelief #HumanitarianAid #IndiaHelpsMyanmar #MyanmarEarthquake #NDRF #OperationBrahma #PMModi Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.