📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

G7 Summit: వివిధ దేశాధినేతలతో మోదీ కీలక చర్చలు

Author Icon By Vanipushpa
Updated: June 18, 2025 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జీ7 శిఖరాగ్ర సమావేశానికి కెనడా వెళ్లిన ప్రధాని మోదీ(Modi) తన పర్యటనను ముగించారు. వివిధ దేశాధినేతలతో భేటీ అనంతరం క్రోషియాకు బయలుదేరారు. కెనడా(Canada) పర్యటన విజయవంతంగా ముగిసిందని ఎక్స్​ వేదికగా పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. జీ 7 సదస్సు(G7 Summit)ను నిర్వహించిన కెనడా ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. అంతర్జాతీయ సమస్యలపై ఫలప్రదమైన చర్చలు జరిగాయని వివరించారు. ప్రపంచ శాంతికి భారత్​ కట్టుబడి ఉందని గుర్తు చేశారు.

G7 Summit: వివిధ దేశాధినేతలతో మోదీ కీలక చర్చలు

వివిధ దేశాధినేతలతో మోదీ భేటీ
అంతకుమందు కెనడా, దక్షిణ కొరియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఆయా నేతలతో ఉగ్రవాదంతో పాటు ఆర్థిక, వాణిజ్య, రక్షణ పరమైన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్టు ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్‌తో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగినట్లు చెప్పారు. వాణిజ్యం, ఆర్థిక, గ్రీన్ హైడ్రోజన్, షిప్‌ బిల్డింగ్, సంస్కృతి వంటి అంశాల్లో సహకారంపై చర్చించినట్లు పోస్ట్‌ చేశారు. యూరోపియన్ యూనియర్​ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లియన్​ను కలిశారు ప్రధాని మోదీ. వ్యవసాయం, సెమీకండక్టర్లు ,కీలక ఖనిజాలు, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో భాగస్వామ్యం.

మిత్రుడితో జరిగిన గొప్ప సమావేశం: మోదీ
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌తో తొలిసారి భేటీ అయిన ప్రధాని మోదీ, ప్రాంతీయ సమస్యలు, వ్యవసాయం, సెమీకండక్టర్ల తయారీ, కీలక ఖనిజాలు, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌తో భేటీని “మిత్రుడితో జరిగిన గొప్ప సమావేశం”గా ప్రధాని మోదీ అభివర్ణించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసాను కలిసిన ఉన్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేసిన మోదీ, రామఫోసాతో సమావేశమవడం సంతోషంగా ఉందన్నారు. జర్మనీ ఛాన్స్‌లర్‌తో జరిగిన భేటీలో రక్షణ, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ఉగ్రవాదానికి అందుతున్న నిధలను అరికట్టడంపై చర్చించినట్టు తెలిపారు. అంతకుముందు జీ7 శిఖరాగ్ర సమామవేశానికి హాజరైన ప్రధాని మోదీని కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ స్వాగతం పలికారు. రక్షణ వ్యవహారాలు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ఉగ్రవాద నిధులపై ఆంక్షల చర్చలు జరిగాయి.

Read Also: Iran : సైబర్ దాడులతో ఇరాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

#ModiInG7 #telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu heads of state key talks with various Latest News in Telugu Modi holds Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.