📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Bangladesh: బంగ్లాదేశ్‌కు భారీ షాకిచ్చిన మోదీ సర్కారు

Author Icon By Vanipushpa
Updated: June 30, 2025 • 2:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్- బంగ్లాదేశ్(India-Bangladesh) మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల మధ్య మోదీ సర్కారు(Modi Governament) కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ నుండి జనపనార, సంబంధిత ఫైబర్ ఉత్పత్తుల దిగుమతి(Import)ని చాలా మార్గాల్లో తక్షణమే నిషేధిస్తూ షాక్ ఇచ్చింది. ఇకపై మహారాష్ట్రలోని ఒక నవసేవ ఓడరేవు ద్వారా మాత్రమే బంగ్లాదేశ్ జనపనార ప్రవేశానికి అనుమతి కొనసాగుతుంది. దేశంలో జనపనార పరిశ్రమను కాపాడేందుకు నడుం బిగించిన కేంద్ర ప్రభుత్వం.. బంగ్లాదేశ్ నుండి వచ్చే దిగుమతులపై ఆంక్షలు విధించింది. శుక్రవారం రాత్రి కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఈ ఉత్తర్వులు జారీ చేసింది. PTI ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భూ మార్గాలు, ఓడరేవుల ద్వారా దిగుమతుల ఆంక్షలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నవసేవ ఫోర్ట్ మినహా బంగ్లాదేశ్ జనపనార ఉత్పత్తుల దిగుమతిని పూర్తిగా నిషేధించారు. బంగ్లాదేశ్ జనపనార చాలా కాలంగా దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం (SAFTA) కింద భారత మార్కెట్లలో సుంకం లేని ప్రాప్యతతో మంచి లాభాలను గడించిందని చెప్పుకొవచ్చు.

Bangladesh: బంగ్లాదేశ్‌కు భారీ షాకిచ్చిన మోదీ సర్కారు

భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం
భారత్ ఎందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నదంటే.. బంగ్లాదేశ్ నుండి దిగుమతి అయ్యే జనపనార ఉత్పత్తులు దేశ జనపనార రంగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి.ముఖ్యంగా నూలు, ఫైబర్ డంపింగ్, సబ్సిడీ దిగుమతులు భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతున్నాయి.

రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు
రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని మోదీ సర్కారు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో యాంటీ-డంపింగ్ (ADD) విధించినప్పటికీ బంగ్లాదేశ్ ఎగుమతిదారులు అన్ని అవకాశాలను ఉపయోగించుకుని భారీగా లాభాలను ఆర్జించారు. కాగా బంగ్లాదేశ్ వాణిజ్యాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయం ఇటీవలి నెలల్లో తీసుకున్న నిర్ణయాల్లో ఇది రెండవది. ఏప్రిల్ ప్రారంభంలో ప్రభుత్వం ఒక ముఖ్యమైన ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌకర్యాన్ని ఉపసంహరించుకుంది, దీని కింద బంగ్లాదేశ్ భారత ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు, ఓడరేవుల ద్వారా మూడవ దేశాలకు ఎగుమతి వస్తువులను పంపడానికి అనుమతించబడింది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) అధినేత అజయ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..భారతదేశం నుండి అనేక వస్తువుల దిగుమతిని బంగ్లాదేశ్ నిషేధించిందని.. దీనికి ప్రతిస్పందనగా భారతదేశం కూడా ఆంక్షలను విధించిందని చెప్పుకొచ్చారు.

Read Also: Russia: ఉక్రెయిన్‌పై 60 క్షిపణులతో విరుచుకుపడిన రష్యా..

#telugu News Ap News in Telugu Bangladesh diplomatic reaction Bangladesh India tension Bangladesh India trade news bilateral relations India Bangladesh Breaking News in Telugu Google News in Telugu India Bangladesh border issue India Bangladesh latest updates India Bangladesh relations India foreign policy 2025 Latest News in Telugu Modi cabinet decisions Modi foreign policy Modi government Bangladesh decision Modi government latest move Modi news today Modi shock to Bangladesh Paper Telugu News South Asia politics Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.