📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Miss World: ఆదివారం సాయంత్రం మిస్ వరల్డ్ ఫైనల్స్..ఘనంగా ఏర్పాట్లు

Author Icon By Anusha
Updated: May 28, 2025 • 11:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమానికి హైదరాబాద్  ఆతిథ్యం ఇవ్వనుంది. మిస్ వరల్డ్ 2025 పోటీల తుది ఘట్టం నగరంలోని హైటెక్స్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుండగా, ఇప్పటికే నాలుగు ఖండాలకు చెందిన 40 దేశాల నుంచి ప్రతినిధుల ఎంపిక పూర్తయింది. వచ్చే ఆదివారం సాయంత్రం జరిగే ఈ ఫైనల్స్ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.ఈ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్(Jayesh Ranjan) స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఆయన సైబరాబాద్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, పర్యాటక శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తుది పోటీలు హైటెక్స్‌లోని హాల్ నంబర్ 4లో జరుగుతాయని తెలిపారు. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమై రాత్రి 9:20 గంటలకు ముగిసే ఈ కార్యక్రమానికి సుమారు 3500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం హైటెక్స్‌లో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు జయేశ్ రంజన్ పేర్కొన్నారు.

అవకాశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఈ అంతర్జాతీయ వేడుకలో కేవలం ప్రముఖులే కాకుండా సాధారణ ప్రజలకు కూడా భాగస్వామ్యం కల్పిస్తున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించగా సుమారు 7500 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో దాదాపు వెయ్యి మందికి అవకాశం కల్పించనున్నట్లు జయేశ్ రంజన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచినట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు.

Miss World: ఆదివారం సాయంత్రం మిస్ వరల్డ్ ఫైనల్స్..ఘనంగా ఏర్పాట్లు

ప్రత్యేకంగా

ఫైనల్స్‌కు సంబంధించిన ప్రాక్టీస్ సెషన్లు మంగళవారం నుంచే ప్రారంభమయ్యాయని, బుధ, గురువారాల్లో కూడా ఇవి కొనసాగుతాయని జయేశ్ రంజన్ వెల్లడించారు. పూర్తిస్థాయి రిహార్సల్స్ మే 30, 31 తేదీల్లో ఉదయం జరుగుతాయని తెలిపారు. ఈ తుది పోటీలను సోనీ టీవీ ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనుందని, ఈ ప్రసార సమయంలో దాదాపు 50 నుంచి 60 నిమిషాల పాటు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాల గురించి ప్రత్యేకంగా చూపిస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా, తుది పోటీలకు న్యాయనిర్ణేతలుగా ఎవరు వ్యవహరిస్తారనే వివరాలను మిస్ వరల్డ్ సంస్థ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుందని జయేశ్ రంజన్ తెలిపారు.

Read Also: KCR: జూన్ 5న కమిషన్ ముందు హాజరు కానున్న కేసీఆర్..!

#HyderabadHostsMissWorld #MissWorld2025 #MissWorldFinals #MissWorldIndia Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.