📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Microsoft: పాకిస్తాన్‌కు మైక్రోసాఫ్ట్ బిగ్ షాక్.. అన్ని ఆఫీసులు బంద్

Author Icon By Vanipushpa
Updated: July 4, 2025 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్(Microsoft) సంస్థ పాకిస్తాన్‌(Pakistan)లో తన కార్యకలాపాలను క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2000 సంవత్సరంలో పాకిస్తాన్‌(Pakistan)లో తన కార్యకలాపాలను ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ జులై 3వ తేదీతో తన కార్యకలాపాలను పూర్తి చేసినట్లు సమాచారం. కేవలం 25 సంవత్సరాల పాటు పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ తన సేవలను వినియోగించింది. అయితే ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇంకా ప్రకటించలేదు. మాజీ ఉద్యోగి జావేద్ రెహ్మాన్(Javad Rehaman) ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. 2000 నుంచి 2007 వరకు రెహ్మాన్ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేశారు. అయితే మైక్రోసాఫ్ట్ ఇప్పుడు పాకిస్తాన్‌లో తమ ఆర్థిక కలాపాలను ముగించడంతో మంచి పని చేసిందని టెక్ నిపుణులు అంటున్నారు.

Microsoft: పాకిస్తాన్‌కు మైక్రోసాఫ్ట్ బిగ్ షాక్.. అన్ని ఆఫీసులు బంద్

పాకిస్తాన్‌లో వాణిజ్య లోటు భారీగా

ఎందుకంటే పాక్‌లో ఎక్కువగా ప్రభుత్వాలు మారడం, శాంతి భద్రతలు లేకపోవడం, అస్థిర కరెన్సీ, అధిక పన్ను రేట్లు, వాణిజ్య విధానం వల్ల వెళ్లిపోవడమే మంచిదని అంటున్నారు.
ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థికంగా దెబ్బతింది. 2024 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ ఎగుమతులు దాదాపు 38.9 బిలియన్లు ఉండగా, దిగుమతులు 63.3 బిలియన్లకు చేరుకున్నాయి. దీనివల్ల 24.4 బిలియన్ల వాణిజ్య లోటు ఏర్పడింది. అయితే ఈ జూన్‌కి పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ విదేశీ మారక నిల్వలు 11.5 బిలియన్లకు తగ్గాయి.

హార్డ్‌వేర్ దిగుమతుల కష్టాలు
విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం వల్ల పాకిస్తాన్‌లోని కంపెనీలు హార్డ్‌వేర్ దిగుమతుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీని వలన కంపెనీలు అవసరమైన హార్డ్‌వేర్‌ను దిగుమతి చేసుకోవడానికి కష్టంగా ఉంది. భారత్‌తో కూడా పాక్ వాణిజ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అయితే మైక్రోసాఫ్ట్‌తో పాటు మిగతా కంపెనీలు కూడా పాకిస్తాన్‌ను విడిచి వెళ్లే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంటున్నారు. 2000 నుంచి 2007 వరకు మైక్రోసాఫ్ట్‌లో పనిచేసిన జావేద్ రెహ్మాన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది బయటకు వచ్చింది. మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం నెగెటివ్‌ కాకుండా స్మార్ట్ మూవ్ అని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Nuclear Deal: అమెరికాకు ఇరాన్ కఠిన షరతు – హామీ లేనిదే చర్చలే లేవు!

#telugu News Ap News in Telugu Breaking News in Telugu foreign exchange reserves Pakistan Google News in Telugu Javed Rehman Microsoft Latest News in Telugu Microsoft closure 2024 Microsoft decision Pakistan Microsoft operations in Pakistan Microsoft Pakistan exit Microsoft shuts offices in Pakistan Pakistan currency crisis Pakistan economic crisis Pakistan import export gap Pakistan tax policy Pakistan trade deficit Paper Telugu News tech companies leaving Pakistan tech industry Pakistan Telugu News online Telugu News Paper Telugu News Today unstable economy Pakistan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.