📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Zuckerberg: చిక్కుల్లో మెటా సంస్థ.. జుకర్‌బర్గ్‌ ఎలా బయటికి వస్తారో!

Author Icon By Vanipushpa
Updated: April 15, 2025 • 2:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెక్ ప్రపంచంలో గొప్ప పేరు సంపాదించిన మెటా సంస్థ ఇప్పుడు చరిత్రలోనే అతిపెద్ద యాంటీ ట్రస్ట్ విచారణను ఎదుర్కొంటోంది. సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌పై అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) సోమవారం నుంచి విచారణ ప్రారంభించింది. సామాజిక మాధ్యమాల్లో గుత్తాధిపత్యం నెలకొల్పేందుకు మెటా తీసుకున్న వ్యూహాలు ఎంతవరకు చట్టబద్ధమైనవో విచారణలో తేలనుంది.
అసలు ఆరోపణలు ఏంటి?
“పోటీ చేయడం కన్నా, వాటిని కొనేయడం మేలు” మెటా కంపెనీ పోటీని తొలగించేందుకు, 2012లో ఇన్‌స్టాగ్రామ్‌, 2014లో వాట్సాప్‌ను కొనుగోలు చేసిందని FTC ఆరోపణలు చేసింది. “పోటీ చేయడం కన్నా, వాటిని కొనేయడం మేలు” అనే 2008లో మార్క్ జుకర్‌బర్గ్ రాసిన ఇంటర్నల్ ఇమెయిల్స్‌ను సాక్షిగా చూపిస్తోంది. ఇవి కంపెనీ వ్యూహాన్ని పటిష్టంగా రుజువు చేస్తున్నాయని FTC అభిప్రాయపడుతోంది.
తన నిర్ణయాలు న్యాయబద్దమే: జుకర్‌బర్గ్
ఈ సందర్భంగా FTC తరపు న్యాయవాదులు, మెటా విస్తరణ ప్రణాళికను “పోటీని చుట్టేస్తూ” సాగినదిగా అభివర్ణిస్తున్నారు. మొబైల్ యాప్‌ల విస్తరణ దశలో, తక్కువ మార్కెట్ షేర్ ఉన్న కంపెనీలను లక్ష్యంగా చేసుకొని, వాటిని మింగేసే విధంగా మెటా వ్యవహరించిందని పేర్కొన్నారు.. జుకర్ బర్గ్ వాదన ఇలా కానీ జుకర్‌బర్గ్ మాత్రం తన నిర్ణయాలను న్యాయబద్ధంగా సమర్థించుకుంటున్నారు. “ఆ మెయిల్స్ చర్చలు ప్రారంభమైన దశలో ఉన్నవే. పూర్తిస్థాయి వ్యూహాన్ని అవి ప్రతిబింబించవు,” అని ఆయన అన్నారు. “ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లను మెటా ఎంతగా అభివృద్ధి చేసిందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. అభివృద్ధి చేయకపోతే అవి ఈ స్థాయికి వచ్చేవే కావు,” అని స్పష్టం చేశారు.
మెటాకు పెద్ద ఆర్థిక దెబ్బే
మెటాకు వ్యతిరేకంగా తీర్పు వెలువరిస్తే.. కోర్టు మెటాకు వ్యతిరేకంగా తీర్పు వెలువరిస్తే మాత్రం.. ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ను వేరుగా విక్రయించాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది మెటాకు పెద్ద ఆర్థిక దెబ్బే అవుతుంది. 2025 నాటికి మెటా సంస్థ తమ ఆదాయంలో సగం పైగా ఇన్‌స్టాగ్రామ్‌ నుంచే వస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అటు రాజకీయ కోణంలోనూ కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. గతంలో డొనాల్డ్ ట్రంప్‌, జుకర్‌బర్గ్‌ల మధ్య సంబంధాలు అంతగా ఉండేవి కాదు. కానీ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చాక కొన్ని మార్పులు జరిగాయి. ఇటీవల జుకర్‌బర్గ్ ట్రంప్‌కు చెందిన ఒక ఫండ్‌కు 10 లక్షల డాలర్ల విరాళం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ, FTC విచారణలో మాత్రం ఎలాంటి సడలింపు లేనట్టు కనిపిస్తోంది.

Read Also: Donald Trump: ఇరాన్ కు ట్రంప్ మళ్ళీ వార్నింగ్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu How will Zuckerberg get out? Latest News in Telugu Meta company in trouble Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.