ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ వ్యవహారం తమ వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపిందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాజీ భార్య మిలిందా (Melinda) గేట్స్ తొలిసారిగా స్పందించారు.. ఎప్‌స్టీన్‌తో బిల్ గేట్స్‌కు ఉన్న సంబంధం, ఇతర మహిళలతో ఆయనకున్న పరిచయాలే తమ విడాకులకు దారితీశాయని ఆమె స్పష్టం చేశారు. ఈ కుంభకోణంలో బిల్ గేట్స్ పేరు బయటకు రావడంతో తాను తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యానని,
Read Also: Anthropic AI: టెక్ కంపెనీలను వణికిస్తున్న ఏఐ టూల్ ఇదే!
బాధితులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నా
అందుకే మూడు దశాబ్దాల బంధాన్ని తెంచుకోవాల్సి వచ్చిందని వివరించారు. వివాహ బంధాన్ని నిలబెట్టుకోవడానికి పాటించాల్సిన విలువలను బిల్ గేట్స్ ఏమాత్రం లెక్కచేయలేదని మిలిందా ఆరోపించారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో తన పేరు ఎందుకు ఉందో, అందులో వెలుగు చూసిన విషయాలపై వివరణ ఇవ్వాల్సింది, బిల్ గేట్స్ మాత్రమేనని ఆమె తేల్చి చెప్పారు.ఇటీవల విడుదలైన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్‌కు సంబంధించి పలు కీలక విషయాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఆయన పలువురు రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాలు నెరిపారని, దీనివల్ల సుఖవ్యాధులు సోకాయని ఎప్‌స్టీన్ ఆ ఫైల్స్‌లో పేర్కొన్నాడు. ఈ విషయం తన భార్య మిలిందా (Melinda) కు తెలియకుండా ఉండేందుకు, ఆమెకు రహస్యంగా ఇచ్చేందుకు యాంటీబయాటిక్స్ కావాలని బిల్ గేట్స్ తనను అడిగినట్లు కూడా అందులో ఉంది. అయితే, ఈ ఆరోపణలను గేట్స్ బృందం తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా ఎప్‌స్టీన్ బాధితులకు న్యాయం జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు మిలిందా తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: