📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Mehul Choksi: మెహుల్ చోక్సీ ఫ్లాట్ మెయింటెనెన్స్ రూ.63 లక్షల బాకీ

Author Icon By Vanipushpa
Updated: April 15, 2025 • 4:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియా వదిలి పారిపోయిన భారతీయ వ్యాపారవేత్త, 65 ఏళ్ల వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని తాజాగా సిబిఐ అరెస్ట్ చేసిన సంగతి మీకు తెలిసిందే. అయితే అతని అరెస్ట్ తరువాత ఎన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఈ తరుణంలోనే ముంబైలోని మలబార్ హిల్‌ గోకుల్ అపార్ట్‌మెంట్స్‌లోని మెహుల్ చోక్సీ ఫ్లాట్ మెయింటెనెన్స్ కోసం దాదాపు రూ.63 లక్షలు కట్టాల్సి ఉన్నట్లు వెల్లడైంది. దీనికి సంబంధించి సొసైటీ మెంబర్ ఒకరు ఈ వాదన చేశారు. ANIతో మాట్లాడుతూ మలబార్ హిల్‌లోని గోకుల్ అపార్ట్‌మెంట్స్‌లోని 9వ, 10వ అలాగే 11వ అంతస్తులలో మెహుల్ చోక్సీకి మూడు ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పారు. అయితే అతను ఏడు సంవత్సరాలుగా మెయింటెనెన్స్ కట్టలేదని తెలిపారు.

ఏడు సంవత్సరాలుగా నిర్వహణ చెల్లింపులు బకాయి
‘మెహుల్ చోక్సీ ఏడు సంవత్సరాలుగా నిర్వహణ చెల్లింపులు బకాయి పడ్డాడు’ అని ఆయన అన్నారు. అతనికి మూడు ఫ్లాట్స్ ఉన్నాయి ఒకటి 9వ అంతస్తు, రెండవది 10వ అంతస్తు, మూడవది 11వ అంతస్తు. 11వ అంతస్తు ఒక టెర్రస్, దానిని అతను చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్నాడు. వడ్డీ కాకూండా దాదాపు రూ. 63 లక్షల మెయింటెనెన్స్ పెండింగ్ లో ఉండగా, 2020లో మా కండోమినియంలో రేనోవేషన్ పనులు జరిగాయి, ఒక్కో ఫ్లాట్ కోసం రూ. 30-35 లక్షల ఖర్చు అయింది, కాబట్టి మెహుల్ చోక్సీ మూడు ఫ్లాట్ల ఖర్చును కలిపితే మొత్తం దాదాపు రూ. 95 లక్షలు అవుతుంది అని తెలిపారు.
ఆస్తులను అటాచ్ చేసిన ED
దీనికి సంబంధించి మరికొన్ని విషయాలను వెల్లడిస్తూ ‘మెహుల్ చోక్సీ ఫ్లాట్‌లో ఇప్పటికే చెట్లు కూడా పెరగడం ప్రారంభించాయి, ఈ చెట్ల వేర్లు ఖచ్చితంగా భవనాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఆ ఖర్చు భారం కూడా భరించాలి. మాకు భారతదేశ న్యాయ వ్యవస్థ, ED అధికారులపై నమ్మకం ఉంది, మా బకాయిలు మాకు లభిస్తాయని మేము ఆశిస్తున్నాము అని అన్నారు. అయితే ఈ ఆస్తిని కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్ చేసింది. ఇండియాని విడిచి బెల్జియం పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ఏప్రిల్ 12న అరెస్టు చేసినట్లు ఈడీ ధృవీకరించింది. ప్రస్తుతం అతను ED అధికారుల కస్టడీలో ఉన్నాడు. భారతదేశం కూడా అతన్ని లొంగిపోవాలని కోరింది. పరారీలో ఉన్న 65 ఏళ్ల ఈ వజ్రాల వ్యాపారి 2 జనవరి 2018న భారతదేశం నుండి పారిపోయాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)ని రూ. 13,850 కోట్ల మేర మోసం చేశాడనే ఆరోపణలపై CBI అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అతని కోసం ఎంతో కాలంగా గాలిస్తున్నాయి. ఈ మోసంలో అతని మేనల్లుడు నీరవ్ మోడీ కూడా ఉన్నాడు. 2014 నుండి 2017 వరకు మెహుల్ చోక్సీ తన సహచరులు, ఇతర PNB అధికారులతో కుమ్మక్కయ్యాడని ఆరోపించింది. ఈ కాలంలో అతను PNB నుండి లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ అలాగే ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్‌ మోసపూరితంగా పొందాడు.

Read Also: Zuckerberg: చిక్కుల్లో మెటా సంస్థ.. జుకర్‌బర్గ్‌ ఎలా బయటికి వస్తారో!

#telugu News Ap News in Telugu Breaking News in Telugu dues are Rs. 63 lakhs Google News in Telugu Latest News in Telugu Mehul Choksi's flat maintenance Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.