📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Agreement: చాగోస్ దీవుల విషయంలో మారిషస్‌, బ్రిటన్ కీలక ఒప్పందం

Author Icon By Vanipushpa
Updated: May 23, 2025 • 3:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి చెక్ పెడుతూ.. బ్రిటన్ చాగోస్ (Britain Chagos)దీవుల పరిపాలనా హక్కులను మారిషస్‌(Marishan)కు అధికారికంగా బదిలీ చేసే ఒప్పందానికి గురువారం అంగీకరించింది. ఈ ఒప్పందం కింద మారిషస్‌కు బ్రిటన్(Britain) ఏటా సుమారు 101 మిలియన్ పౌండ్లు (రూ. 1,160 కోట్లకు పైగా) చెల్లిస్తూ.. డియేగో గార్షియా(Garshiya) దీవిలోని కీలక సైనిక స్థావరాన్ని 99 సంవత్సరాల పాటు లీజుకు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ స్థావరం ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ సంయుక్తంగా నిర్వహించే సైనిక కేంద్రంగా పనిచేస్తోంది. నిఘా సమాచార సేకరణ, తీవ్రవాద వ్యతిరేక చర్యల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఒప్పందంపై బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ మాట్లాడుతూ.. మన దేశ భద్రతకు డియేగో గార్షియా స్థావరం కీలకంగా మారింది. ఇప్పుడు ఈ ఒప్పందం ద్వారా భవిష్యత్ తరాల భద్రతను సుస్థిరం చేసుకుంటున్నాం’ అని తెలిపారు.

Agreement: చాగోస్ దీవుల విషయంలో మారిషస్‌, బ్రిటన్ కీలక ఒప్పందం

‘చారిత్రాత్మక విజయం’గా భారత ప్రశంస
ఈ పరిణామంపై భారత ప్రభుత్వం స్పందిస్తూ.. ఈ ఒప్పందాన్ని ఒక ‘చారిత్రాత్మక విజయం’గా అభివర్ణించింది. ‘చాగోస్ దీవులపై బ్రిటన్-మారిషస్ ఒప్పందం ద్వారా మారిషస్‌కు పరిపాలనా హక్కులు తిరిగి బదలాయించడం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించే దిశగా ముఖ్యమైన అడుగు’” అని విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘ఎప్పటినుంచో చాగోస్ దీవులపై మారిషస్ న్యాయబద్ధమైన హక్కులకు భారత్ మద్దతు ఇస్తోంది. ఈ ఒప్పందం వలసపాలన నుంచి విముక్తి లక్ష్యానికి అనుగుణంగా ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మారిషస్‌తో కలిసి శాంతి, భద్రత, స్థిరత్వం కోసం భారత్ పనిచేస్తుంది’ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
చరిత్ర: 1814లో నెపోలియన్ యుద్ధాల తర్వాత బ్రిటన్ ఈ దీవులను ఫ్రాన్స్ నుంచి స్వాధీనం చేసుకుంది. 1965లో మారిషస్‌కు స్వాతంత్ర్యం ఇవ్వడానికి ముందు దీవులను వేరు చేసింది. అందుబాటులో ఉన్న సిబ్బంది: డియేగో గార్షియాలో సుమారు 2,500 మంది సైనిక సిబ్బంది ఉనికి ఉండగా… వీరిలో మెజారిటీ అమెరికా సిబ్బంది. 2008లో ఈ స్థావరాన్ని ఉగ్రవాద అనుమానితుల రహస్య రవాణా (rendition flights) కోసం వాడినట్టు అమెరికా అంగీకరించింది.
అంతర్జాతీయంగా వలస పాలన నుంచి విముక్తి
ఈ ఒప్పందం ద్వారా బ్రిటన్ తన స్వరాజ్యాధికారం తగ్గించుకుంటూ మారిషస్‌కు న్యాయం చేస్తున్నప్పటికీ, చైనా ప్రభావం, భారీ ఆర్థిక భారం వంటి అంశాలపై బ్రిటన్ లోపల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, ఇది అంతర్జాతీయంగా వలస పాలన నుంచి విముక్తి అంశాన్ని మరింత బలపరచే పరిణామంగా భావిస్తున్నారు.

యూకే పౌరుల నుంచి భారీ వ్యతిరేకత నేపథ్యంలోనే బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే, ఖచ్చితమైన ఖర్చుల వివరాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. మరోవైపు, మారిషస్‌కు చైనాతో ఉన్న బలమైన వాణిజ్య సంబంధాల నేపథ్యంలో జాతీయ భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలు కెమీ బడెనాక్ ఈ నిర్ణయాన్ని విమర్శించారు. ప్రధాని కియర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం ‘బ్రిటిష్ భూభాగాన్ని అప్పగించడమే కాకుండా ప్రజలపై భారీ ఆర్థిక భారం మోపుతోంది’ విమర్శించారు.

Read Also: Jaishankar: ట్రంప్ మధ్యవర్తిత్వం వట్టిదే: జైశంకర్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Britain reach Google News in Telugu key agreement Latest News in Telugu Mauritius on Chagos Islands Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.