📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ ఎంపిక

Author Icon By Vanipushpa
Updated: March 10, 2025 • 10:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కెనడా నూతన ప్రధాన మంత్రిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. లిబరల్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలతో పాటు ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్టు జస్టిన్ ట్రూడో జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో లిబర్ పార్టీ అధ్యక్ష ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ఓటింగ్‌లో కెనడా రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ మార్క్‌ కార్నీ విజయం సాధించారు. పార్టీ సారథి కోసం పోటీలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్‌ను ఓడించి పార్టీ నూతన సారథిగా ఎన్నికయ్యారు. మొత్తం 150,000 మంది పాల్గొన్న ఓటింగ్‌లో కార్నేకు 131,674 ఓట్లు అంటే దాదాపు 86 శాతం వచ్చాయి. ఇక, క్రిస్టియా ఫ్రీలాండ్‌‌కు 11,134, కరినా గౌల్డ్‌కు 4,785, ఫ్రాంక్‌ బేలిస్‌కు 4,038 ఓట్లు మాత్రమే దక్కాయి.


హార్వర్డ్‌లో ఉన్నత విద్య
అమెరికా నుంచి సుంకాల ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ.. కెనడా పాలన పగ్గాలను కార్నీ చేపట్టనున్నారు. 1965లో ఫోర్ట్‌ స్మిత్‌లో జన్మించిన మార్క్ కార్నే… హార్వర్డ్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. అనంతరం గోల్డ్‌మన్‌ శాక్స్‌లో 13 ఏళ్లు పనిచేశారు. 2003లో బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఏడాది తర్వాత 2004లో ఆ బాధ్యతల నుంచి వైదొలగిన కార్నే.. కెనడా ఆర్థిక మంత్రి పదవిని చేపట్టారు. అయితే, 2008 ఫిబ్రవరి 1న సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు.
ఆర్థిక సంక్షోభం పరిష్కారంలో కీలక పాత్ర
కెనడా కేంద్ర బ్యాంకు గవర్నర్‌గా ఉన్నప్పుడు 2008-09 ప్రపంచ ఆర్థిక సంక్షోభం పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. వడ్డీ రేట్లను సున్నాకు తగ్గించి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణకు అవసరమైన చర్యలను సమన్వయపరచడంలో కీలకంగా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు. ఇక, 300 ఏళ్ల చరిత్ర కలిగిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ గవర్నర్‌గా 2013లో ఎన్నికయ్యారు. దీంతో ఆ బ్యాంకుకు మొట్టమొదటి నాన్‌-బ్రిటిష్‌ గవర్నర్‌గా ఆయన రికార్డులకెక్కారు. అంతేకాదు, జీ7 కూటమిలోని రెండు సెంట్రల్‌ బ్యాంకులకు నాయకత్వం వహించిన వ్యక్తిగానూ నిలిచారు.
కార్నీకి అత్యంత ఆదరణ
ఏడేళ్ల పాటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ గవర్నర్‌గా కొనసాగిన ఆయన 2020లో తప్పుకున్నారు. అనంతరం ఐక్యరాజ్యసమితి ఆర్థిక, వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా సేవలందించారు. జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటన అనంతరం.. లిబరల్ పార్టీలో ప్రధాని రేసులో ఉన్న నలుగురిలో కార్నీ అత్యంత ఆదరణ పొందారు. దీంతోపాటుగా ఎక్కువ విరాళాలు సేకరించిన అభ్యర్థిగానూ ఆయన నిలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పోటీచేయని, క్యాబినెట్‌లో పనిచేసిన అనుభవం లేని కార్నీ.. ట్రూడో వారసుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu canada Canada's new Prime Minister Google News in Telugu Latest News in Telugu Mark Carney elected Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.