📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Marco Rubio: ఇరాన్ శాంతిని కోరుకుంటే అందుకు సిద్ధం: రూబియో

Author Icon By Anusha
Updated: June 23, 2025 • 7:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడంలో భాగంగా అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్’ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఫోర్డో, నతాంజ్, ఇన్‌ఫహాన్ వంటి కీలక అణు కేంద్రాలపై అమెరికా భారీ వైమానిక దాడులు నిర్వహించి, అవి ధ్వంసం చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ దాడులు ముఖ్యంగా రాత్రి వేళల్లో జరగడం, అత్యాధునిక టెక్నాలజీతో ఆయుధాలు వినియోగించడం ప్రత్యేకంగా నిలిచాయి.ఇతర ఏ దేశమైనా ఇటువంటి దాడికి వెంటనే ప్రతిచర్య చూపించేది.అయితే, ఇప్పటి వరకు టెహ్రాన్ (Tehran) ఎలాంటి ప్రతిచర్యకు దిగలేదు. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నిర్ణయంపైనే అమెరికా కార్యాచరణ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

అత్యవసర సమావేశమైంది

ఇరాన్ ప్రభుత్వం శాంతిని కోరుకుంటే, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని, లేదు ప్రతీకార చర్యలకు దిగితే ఇరాన్ పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుందని, కనీసం సొంత గగనతలాన్ని కూడా రక్షించుకోలేదని రుబియో (Marco Rubio) అన్నారు. అమెరికా సైనిక దళాలకు ఆతిథ్యమిచ్చే దేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.కాగా, ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశమైంది. అమెరికా అంతర్జాతీయ చట్టాలను (American International Law) ఉల్లంఘించి ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడులు చేసిందని ఇరాన్ ప్రతినిధి అమిర్ సయాద్ ఇర్వానీ ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేస్తూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంపై చర్చించాలని విజ్ఞప్తి చేశారు. 

Marco Rubio

ప్రతీకార దారి

ఇప్పటివరకు ఇరాన్ నుంచి స్పందన లేకపోయినా, భవిష్యత్‌ను ప్రభావితం చేసే ఈ సంఘటనపై ప్రపంచం మొత్తం కన్నేసి ఉంది. శాంతి, దౌత్య మార్గంలో పరిష్కారం తీసుకురావడమే ప్రపంచ భద్రతకు మేలైన మార్గమని నిపుణుల అభిప్రాయం.భవిష్యత్తులో పెద్ద ఎత్తున మారణ హోమానికి ఇది హాని కావచ్చన్న నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇరాన్ (Iran) శాంతినీ, స్థిరతనూ ఎంచుకుంటే ఇది వారికే మేలు. కానీ ప్రతీకార దారి ఎంచుకుంటే, అది వారి అభివృద్ధిని అడ్డుకునే మార్గం అవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Read Also: Hardeep Singh Puri: హార్ముజ్ జలసంధి మూసివేత‌.. స్పందించిన కేంద్ర‌మంత్రి

#IranCrisis #IranNuclearTensions #Marco Rubio #OperationMidnightHammer #USAirStrikes Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.