📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Manoj Sinha: భారత ఆర్మీ దేనికైనా రెడీ అన్న మనోజ్ సిన్హా

Author Icon By Vanipushpa
Updated: May 9, 2025 • 5:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్ము కశ్మీర్‌ (Jammu Kashmir) లోని పలు సైనిక స్థావరాలపై పాకిస్థాన్ (Pakistan)గత రాత్రి డ్రోన్లతో దాడులకు పాల్పడిన నేపథ్యంలో, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత సాయుధ బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం స్పష్టం చేశారు. యూరి సెక్టార్‌లో క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా(Manoj Sinha) మాట్లాడుతూ, “పాకిస్థాన్ దాడులు చేసింది. కానీ ఎలాంటి దుశ్చర్యలనైనా ఎదుర్కొని, తిప్పికొట్టేందుకు భారత సాయుధ బలగాలు పూర్తి సంసిద్ధతతో ఉన్నాయి” అని తెలిపారు. జమ్ము కశ్మీర్ యంత్రాంగం ఇక్కడి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన భరోసా ఇచ్చారు.

Manoj Sinha: భారత ఆర్మీ దేనికైనా రెడీ అన్న మనోజ్ సిన్హా

తక్షణ సహాయంగా ఎక్స్‌గ్రేషియా
సరిహద్దు గ్రామాలలో పర్యటించి, నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించినట్లు సిన్హా వెల్లడించారు. ఈ ఘటనల్లో గాయపడిన వారికి, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తక్షణ సహాయంగా ఎక్స్‌గ్రేషియా అందించినట్లు ఆయన పేర్కొన్నారు. జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని, ఈ ప్రాంతాల్లో కొత్త బంకర్ల నిర్మాణం ఆవశ్యకత ఉందని ఆయన నొక్కి చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాల్లో కొత్త బంకర్లను నిర్మిస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ హామీ ఇచ్చారు. సరిహద్దు ప్రజల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. కాగా, యూరి సెక్టార్‌లో భద్రతా బలగాలను కలిసిన ఎల్జీ వారితో మాట్లాడుతూ “హౌ ఈజ్ ది జోష్” అని అడిగారు.

Read Also: Mehbooba Mufti: మహిళలను, పిల్లలను ఎందుకుచంపుతున్నారు? మెహబుబా ముఫ్తీ కంటతడి

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Indian Army is ready for anything Latest News in Telugu Manoj Sinha says Operation Sindhoor Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.